Breaking News

జీమెయిల్‌ ఐడీని మార్చుకోవచ్చు

Published on Wed, 12/31/2025 - 07:29

ప్రస్తుతం ఉపయోగిస్తున్న జీమెయిల్‌ అకౌంట్‌లోని డేటాను కోల్పోకుండానే, ప్రైమరీ ఖాతాకి కొత్త ఐడీని క్రియేట్‌ చేసుకునే వీలు కలి్పస్తూ టెక్‌ దిగ్గజం గూగుల్‌ కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. దీన్ని దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచరు కారణంగా యూజరు కొత్త జీమెయిల్‌ ఐడీకి మారినా, పాత ఖాతాలో సేవ్‌ చేసుకున్న ఫొటోలు, మెసేజీలు, ఈమెయిల్స్‌ లాంటి డేటాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని అధికారిక సపోర్ట్‌ పేజీలో పేర్కొంది. 

యూజర్లు తమ పాత లేదా కొత్త ఈమెయిల్‌ అడ్రెస్‌తో జీమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్, డ్రైవ్‌లాంటి గూగుల్‌ సర్వీసులకు సైన్‌ ఇన్‌ చేయొచ్చని వివరించింది. ఇలా ఒకసారి కొత్త జీమెయిల్‌ ఐడీని క్రియేట్‌ చేసుకున్నాక మళ్లీ 12 నెలల వరకు మరో కొత్త ఐడీని క్రియేట్‌ చేసుకోవడానికి ఉండదు. పాత అడ్రెస్‌ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. 

పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌ కేటగిరీ కింద గూగుల్‌ అకౌంట్‌ సెటింగ్స్‌లోని ఈమెయిల్‌ సెక్షన్‌లో ఈ ఫీచరు లభ్యతను యూజర్లు చెక్‌ చేసుకోవచ్చు. డేటా భద్రతకు గ్యారంటీ ఉన్నప్పటికీ, కొన్ని యాప్‌ సెట్టింగ్‌లు మారిపోయే అవకాశం ఉన్నందున మార్పులు, చేర్పులను చేపట్టడానికి ముందు యూజర్లు తమ సమాచారాన్ని బ్యాకప్‌ తీసుకోవాలంటూ గూగుల్‌ సూచించింది.

ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం

#

Tags : 1

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)

+5

రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)