Breaking News

గూగుల్‌కు భారీ షాక్‌ .. అదే జరిగితే వందల కోట్లలో నష్టం!

Published on Mon, 04/17/2023 - 17:33

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌కు కొత్త గుబులు మొదలైందా? ఒపెరా, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, ఇంటర్‌నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌.. ఒకప్పుడు నెట్‌ సామాజ్రాన్ని ఏలాయి. గూగుల్‌ రాగానే పైవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గూగుల్‌ గుత్తాధిపత్యం దెబ్బకు మిగిలిన సెర్చింజన్లు తట్టాబుట్టా సర్దేసుకున్నాయి. అలాంటి గూగుల్‌ ఇప్పుడు అప్రమత్తం కావల్సిన దశ వచ్చిందా? ఆన్‌లైన్‌ సమాచార శోధనలో ఏళ్లుగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సెర్చింజన్‌కు చాట్‌జీపీటీ రూపంలో ముప్పు ముంచుకొస్తుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 

చాట్‌జీపీటీతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో మైక్రోసాఫ్ట్‌ తెరతీసిన యుద్ధం ఇప్పుడు గూగుల్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది? ముఖ్యంగా ఏ సమాచారం కావాలన్నా క్లుప్తంగా సమాధానం ఇస్తుండడంతో ఇప్పుడు యూజర్లు చాట్‌జీపీటీ వైపు మళ్లుతున్నారు. పనిలో పనిగా మైక్రోసాఫ్ట్‌ తన సొంత సెర్చింజన్‌  బింగ్‌లో చాట్‌జీపీటీని విస్తరించింది. దీంతో యూజర్లు వారికి ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌కు బదులు బింగ్‌ను అడగడం పరిపాటిగా మారింది.

ఈ క్రమంలో ఇతర టెక్‌ సంస్థలు తమ గాడ్జెట్స్‌లో డిఫాల్ట్‌ సెర్చింజన్‌గా గూగుల్‌కు బదులు బింగ్‌ను జతచేయాలని భావిస్తున్నాయి. ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (idc) నివేదిక ప్రకారం..2022లో శాంసంగ్‌  261 మిలియన్లు (26.1కోట్లు) స్మార్ట్‌ఫోన్లను సరఫరా చేసింది. ఈ ఫోన్‌లు గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో పనిచేస్తాయి.అంతేకాదు వినియోగదారులకు అందించే ముందే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లు యాప్స్‌ను, ఇతర సేవల్ని శాంసంగ్‌ ఫోన్‌లలో ఇన్‌స్టాల్‌ అందిస్తున్నాయి. 

తాజాగా సెర్చింజన్‌ విషయంలో శాంసంగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్‌ ఫోన్‌లలో ఉన్న గూగుల్‌ సెర్చింజన్‌  బదులు మైక్రోసాఫ్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌ బింగ్‌ను డీఫాల్ట్‌ సెర్చింజన్‌గా ఇచ్చే విధంగా చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఒకవేళ అదే జరిగితే గూగుల్‌కు 3 బిలియన్ల నష్టం (రూ.300కోట్లు) వాటిల్లే ప్రమాదం ఉందని హైలెట్‌ చేస్తున్నాయి. ప్రస్తుతానికి శాంసంగ్‌.. మైక్రోసాఫ్ట్తో చర్చలు జరుపుతుందని, అప్పటి వరకు గూగుల్‌నే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఏమన్నారంటే?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)