Breaking News

గూగుల్‌ ‘గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో’ పేరు మార్పు

Published on Tue, 01/28/2025 - 14:46

అమెరికాలోని యూజర్ల కోసం గల్ఫ్ ఆఫ్ మెక్సికో(Gulf of Mexico) పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా(Gulf of America)గా మార్చాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్(Google Maps) ఇటీవల ముఖ్యమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. పేర్ల మార్పునకు సంబంధించి జియోగ్రాఫిక్‌ నేమ్స్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(జీఎన్ఐఎస్)కు యూఎస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ది ఇంటీరియర్ సమాచారం అందించింది. దాంతో గూగుల్‌ మ్యాప్స్‌లో ఈ మేరకు త్వరలో అప్‌డేట్‌ చేస్తామని ఆల్ఫాబెట్‌ ఇంక్‌. తెలిపింది.

అమెరికా యూజర్ల కోసం గల్ఫ్‌ ఆఫ​ మెక్సికోను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ అనే కొత్త పేరును ప్రతిబింబించేలా గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫామ్‌లో అప్‌డేట్‌ అందించనుంది. అధికారిక ప్రభుత్వ వర్గాలు పేరు మార్చిన తర్వాత ఈ మార్పు అమల్లోకి రానునున్నట్లు పేర్కొంది. యూఎస్ వెలుపల వినియోగదారుల కోసం, గూగుల్ మ్యాప్స్ స్పష్టత, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి పాత పేరు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను, కొత్త పేరు ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ను రెండింటినీ డిస్‌ప్లే చేయనుంది.

ఇదీ చదవండి: చైనా ఏఐ డీప్‌సీక్‌పై ఓపెన్‌ఏఐ సీఈఓ స్పందన

అధికారిక ప్రభుత్వ వర్గాల్లో పేరు మార్పులకు సంబంధించి ఏదైనా అప్‌డేట్‌ వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్స్ సదరు పేరు మార్పులు చేయడం ఆనవాయితీ. గల్ఫ్ ఆఫ్ అమెరికా అప్‌డేట్‌తో పాటు, గూగుల్ మ్యాప్స్ అమెరికా వినియోగదారుల కోసం మౌంట్ మెకిన్లీని డెనాలీగా పేరు మార్చనుంది. ఒబామా హయాంలో మౌంట్ మెకిన్లీని డెనాలీగా పిలిచేవారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఖచ్చితమైన, సమగ్రమైన భౌగోళిక సమాచారం అందించేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ సేవలందిస్తోంది. గతంలో సీ ఆఫ్‌ జపాన్‌(ఈస్ట్‌ సీ), పర్షియన్ గల్ఫ్ (అరేబియా గల్ఫ్)ల పేర్లు మార్చడం వల్ల కంపెనీ సవాళ్లను ఎదుర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)