Breaking News

అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్‌ భారీ ఆఫీస్‌!

Published on Fri, 01/03/2025 - 17:19

గూగుల్ (Google) గురుగ్రామ్‌లో 550,000 చదరపు అడుగుల భారీ ఆఫీస్ స్థలాన్ని (office space) లీజుకు తీసుకుంది. ఇది దేశంలోని అతిపెద్ద వర్క్‌స్పేస్ డీల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని, గురుగ్రామ్‌లోని మొత్తం టవర్‌ను లీజుకు తీసుకోవడానికి టెక్ దిగ్గజం చర్చలు జరుపుతున్నట్లు ఒక నివేదిక తెలిపింది.

ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. గూగుల్‌ ప్రముఖ మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్ అయిన టేబుల్ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆఫీస్‌ స్థలాన్ని భవిష్యత్తులో అదనంగా 200,000 చదరపు అడుగుల వరకు విస్తరించుకునే అవకాశాన్ని కూడా ఈ సంస్థ గూగుల్‌కు అందిస్తుందని సమాచారం.

ఆసక్తికరంగా గూగుల్ గురుగ్రామ్‌లో 700,000 చదరపు అడుగుల లీజును 2022లో ముగించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు భారీ ఆఫీస్‌ స్పేస్‌ కోసం అన్వేషిస్తుండటం గమనార్హం. గూగుల్‌ గతేడాదే బెంగళూరులోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో చదరపు అడుగుకి నెలవారీ అద్దె రూ.62 చొప్పున డీల్ కుదిరినట్లు సమాచారం.

2022లో హైదరాబాద్‌లో 600,000 చదరపు అడుగుల లీజు పునరుద్ధరణ, బెంగళూరులోని బాగ్‌మేన్ డెవలపర్‌లతో 1.3 మిలియన్ చదరపు అడుగుల ఒప్పందంతో సహా భారతదేశంలో గూగుల్‌ గణనీయమైన విస్తరణల శ్రేణిని గురుగ్రామ్‌లో ఈ తాజా లీజింగ్‌ అనుసరించింది.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)