Breaking News

గూగుల్‌లో ఆగని లేఆఫ్‌లు.. మళ్లీ వందలాది తొలగింపులు

Published on Fri, 04/11/2025 - 20:39

ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌లో (Google) లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగం నుంచి తాజాగా వందలాది మంది ఉద్యోగులను తొలగించిందని ( layoff )ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్‌లో పనిచేసే ఉద్యోగులు ఇందులో ఉన్నారని ‘ది ఇన్ఫర్మేషన్‌’ అనే వార్తా నివేదిక పేర్కొంది. అయితే ఎంత మంది ఉద్యోగులు తొలగింపులకు గురయ్యారన్న వివరాలు వెల్లడి కాలేదు.

తొలగింపు వెనుక కారణం..
కార్యకలాపాలను క్రమబద్ధీకరణ, సామర్థ్య పెంపు కోసం  గూగుల్ చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు అనుగుణంగా ఈ సిబ్బంది పునర్‌వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది గూగుల్ తన ఆండ్రాయిడ్, క్రోమ్ టీమ్‌లను పిక్సెల్ అండ్ డివైజెస్ గ్రూప్ కింద విలీనం చేయడంతో ప్రారంభమైన సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ తొలగింపులు జరిగాయి. జనవరిలో కంపెనీ స్వచ్ఛంద నిష్క్రమణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ తాజా ఉద్యోగ కోతలు ఆ చొరవకు కొనసాగింపు అని సూచిస్తున్నాయి.

గూగుల్ ప్రకారం.. చురుకుదనం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడమే పునర్నిర్మాణం లక్ష్యం. ఇది కంపెనీ తన ప్రధాన ఉత్పత్తులు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. వందలాది ఉద్యోగులకు నష్టం కలిగించే ఈ చర్య వ్యయ తగ్గింపు, వనరుల ఆప్టిమైజ్ కోసం మొత్తం టెక్‌ పరిశ్రమ అవలంభిస్తున్న ధోరణిని ప్రతిబింబిస్తోంది.

ఇన్నోవేషన్ పై ప్రభావం
పునర్ వ్యవస్థీకరణకు గూగుల్ తీసుకున్న నిర్ణయం ఉత్పత్తుల అభివృద్ధి, ఆవిష్కరణలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనలను రేకెత్తిస్తోంది. కీలక బృందాల్లో తక్కువ మంది ఉద్యోగులతో, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పురోగతిలో గూగుల్ ఎలా ముందుకు వెళ్తుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంకా నియామకాలు జరుగుతున్నాయని, ఇన్నోవేషన్ పై పూర్తిగా వెనక్కి తగ్గకుండా వనరులను పునర్వినియోగం చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.

టెక్ పరిశ్రమలో తొలగింపులు
ఉద్యోగాల కోత, పునర్నిర్మాణ చర్యలను అమలు చేస్తోన్న టెక్‌ కంపెనీ గూగుల్ ఒక్కటే కాదు. ఆర్థిక అనిశ్చితి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ వరకు కారణాలను చూపుతూ అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా పలు బడా టెక్ కంపెనీలు గత ఏడాది ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)