Breaking News

సముద్రంపై ఆఫీస్.. గూగుల్ కో-ఫౌండర్ సూపర్‌యాచ్!

Published on Sun, 07/26/2026 - 16:55

సాధారణంగా.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల గురించి మాట్లాడితే, వారి విలాసవంతమైన జీవనశైలి గురించి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే.. ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్‌లు, సూపర్‌యాచ్‌లు కూడా వారి జీవితంలో భాగమే. అయితే గూగుల్ సహ వ్యవస్థాపకుడు 'సెర్గీ బ్రిన్' మాత్రం తన సూపర్‌యాచ్‌ను కేవలం విహారం కోసం కాకుండా.. సముద్రంపై తేలియాడే ఆఫీసుగా మార్చుకున్నారు. ఈ కారణంగానే ఆయన సూపర్‌యాచ్ 'డ్రాగన్‌ఫ్లై' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

జర్మనీకి చెందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ ల్యూర్‌సెన్ ఈ యాచ్‌ను నిర్మించింది. దాదాపు 466 అడుగుల పొడవు (142.1 మీటర్లు) ఉన్న ఈ సూపర్‌యాచ్‌ను 2024లో సెర్గీ బ్రిన్‌కు అందజేశారు. ప్రారంభంలో.. దీనిని మరో వ్యక్తి కోసం తయారు చేసినప్పటికీ, చివరికి బ్రిన్ సొంతం చేసుకున్నారు. దీని విలువ 450 మిలియన్ డాలర్లు (రూ.3700 కోట్ల కంటే ఎక్కువ). 

ఈ యాచ్ ప్రత్యేకత కేవలం విలాసవంతమైన సౌకర్యాలు మాత్రమే కాదు. అందులో ఏర్పాటు చేసిన ప్రత్యేక బిజినెస్ డెక్. సాధారణంగా సూపర్‌యాచ్‌లలో ఎక్కువ స్థలాన్ని అతిథుల కోసం, వినోదం కోసం కేటాయిస్తారు. కానీ.. డ్రాగన్‌ఫ్లైలో మాత్రం పూర్తి స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వ్యక్తిగత ఆఫీస్, సమావేశాల కోసం ప్రత్యేక స్థలం, జిమ్, గేమ్స్ రూమ్‌తో పాటు బయటకు కనిపించని హెలికాప్టర్ హ్యాంగర్ కూడా ఉంది. దీంతో ప్రపంచంలో ఎక్కడ సముద్ర ప్రయాణం చేస్తున్నా.. అవసరమైనప్పుడు హెలికాప్టర్‌లో వచ్చి నేరుగా యాచ్‌పై దిగవచ్చు. అదే సమయంలో కార్యాలయ పనులను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చు.

డ్రాగన్‌ఫ్లైలో అత్యాధునిక టెక్నాలజీలను కూడా ఉపయోగించారు. ఇందులో డీజిల్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఇంజిన్ వ్యవస్థను అమర్చారు. దీని వల్ల ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా ప్రయాణ సమయంలో శబ్దం, కంపనాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ యాచ్ గరిష్టంగా 24 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. సుదూర సముద్ర ప్రయాణాలను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చే ఆధునిక నావిగేషన్ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ సూపర్‌యాచ్‌లో ఒకేసారి 18 మంది అతిథులు ఉండటానికి సౌకర్యవంతంగా ఉంది. వారికి సేవలు అందించేందుకు దాదాపు 40 మంది సిబ్బంది ఉండవచ్చు. రెండు హెలిప్యాడ్లు, స్విమ్మింగ్ పూల్స్, విశాలమైన విశ్రాంతి ప్రదేశాలు వంటి అనేక సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేశారు. అందుకే ఇది కేవలం ఒక విలాసవంతమైన యాచ్ మాత్రమే కాదు.. 5 స్టార్ హోటల్‌ను తలపించే తేలియాడే భవనం అని చెప్పవచ్చు.

ఇదీ చదవండి: నాసా కొత్త ప్రయోగం.. శని వలయాల రహస్యాలపై దృష్టి!

#

Tags : 1

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)