Breaking News

ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్‌ బంపరాఫర్‌.. 

Published on Thu, 09/07/2023 - 16:57

దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google) బంపరాఫర్‌ ప్రకటించింది. 1,000 మంది ప్రభుత్వ అధికారులకు సైబర్‌ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ సెర్ట్‌ఇన్‌ (CERT-In)తో గూగుల్‌ క్లౌడ్‌ (Google Cloud) తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. 

సెర్ట్‌ఇన్‌ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)లో భాగం. ఇది సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్‌, హ్యాకింగ్, ఇతర సైబర్ సంబంధిత సమస్యలను చూసుకుంటుంది. (IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ రిపోర్ట్‌!)

రూ.లక్ష స్కాలర్‌షిప్‌ కూడా..
'సైబర్ ఫోర్స్' పేరుతో కొంతమంది ప్రభుత్వ అధికారులకు సైబర్ డిఫెన్స్ బెస్ట్ ప్రాక్టీస్‌లలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా వీరికి జనరేటివ్ ఏఐ వినియోగం, సైబర్ సెక్యూరిటీ ఏఐ హ్యాకథాన్‌ల నిర్వహణ వంటివి గూగుల్‌ క్లౌడ్, మాండియంట్ నిపుణులచే నిర్వహించన్నట్లు గూగుల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు రూ.లక్ష స్కాలర్‌షిప్‌ కూడా ఇవ్వననున్నట్లు పేర్కొంది.

‘సైబర్ భద్రత మన డిజిటల్ భవిష్యత్తుకు మూలస్తంభం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మరింత ముందుకు సాగాలంటే జనరేటివ్‌ ఏఐ శక్తిని వినియోగించుకోవడం చాలా అవసరం’ అని సెర్ట​్‌ఇన్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహ్ల్ పేర్కొన్నారు. 

ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖతో కలిసి దేశవ్యాప్తంగా భారతీయులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని సులభతరం చేస్తున్నామని, కొత్త సురక్షితమైన భద్రత సేవలను అందించడానికి సహకారం అందిస్తున్నామని గూగుల్‌ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ అన్నారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)