Breaking News

‘గూగులీ‌నెస్‌’ అంటే తెలుసా? సుందర్‌ పిచాయ్‌ వివరణ

Published on Mon, 12/23/2024 - 17:16

‘గూగులీ‌నెస్‌’ అనే పదాన్ని చాలా కాలంగా గూగుల్‌ ఉద్యోగులు ఉపయోగిస్తున్నారు. మళ్లీ గూగుల్‌లో లేఆఫ్స్‌ ఉంటాయని ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ పదం మరోసారి వైరల్‌గా మారింది. ఉద్యోగులు గూగుల్ సంస్కృతి, విలువలకు సరిపోతారా లేదా అని తనిఖీ చేయడంలో ఈ పదం ఉపయోగపడుతుందని సంస్థలో ఉన్నతాధికారులు నమ్ముతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల జరిగిన కంపెనీ వైడ్ ఫోరమ్‌ సమావేశంలో ఈ పదానికి సంబంధించి మరింత స్పష్టతను ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆరు కీలక అంశాలపై గూగులీనెస్‌ ఆధారపడి ఉంటుందని చెప్పారు.

మిషన్ ఫస్ట్: గూగుల్ మిషన్‌కు, ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తులో ఆయా ప్రాజెక్ట్‌ల్లో భారీ లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. ఫ్యూచర్‌ విజన్‌ కోసం పని చేయాలి.

అందరికీ ఉపయోగపడే వాటిపై దృష్టి: ప్రజల జీవితాలను నిజంగా మెరుగుపరిచే ఉత్పత్తులను సృష్టించాలి. అందరికీ ఉపయోగపడే వాటిపై ఉద్యోగులు దృష్టి సారించాలి.

ధైర్యంగా, బాధ్యతాయుతంగా ఉండడం: ఏ పని చేస్తున్నప్పుడైనాసరే మీరు చేస్తున్నది బలంగా నమ్మి ధైర్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వచ్చే ఫలితాలకు సైతం బాధ్యత తీసుకునేటప్పుడు సాహసోపేతమైన ఆలోచనలను ప్రోత్సహించవచ్చు.

వనరులను సద్వినియోగం చేసుకోవడం: మనం చేయాలనుకుంటున్న పనులకు అన్ని సందర్భాల్లోనూ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. చాలా వనరులు అవసరం అవ్వొచ్చు. కానీ పరిమిత వనరులను సద్వినియోగం చేసుకుని మెరుగైనా ఫలితాలు రాబట్టేలా పని చేయాలి.

వేగంగా.. సరదాగా..: చేసేపనిని నిర్దేశించిన కాలంలో పూర్తి చేయాలి. దాంతోపాటు భారంగా కాకుండా, సరదాగా పని చేయాలి.

టీమ్ గూగుల్: టీమ్ వర్క్ చాలా ముఖ్యం. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.

ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్‌ పని చేయదు! కారణం..

10 శాతం మందికి లేఆఫ్స్‌..

కొంతకాలంగా ఎలాంటి తొలగింపులు లేకుండా నిశ్చలంగా ఉన్న గూగుల్ కంపెనీ మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్దమైంది. ఈ ప్రభావం మేనేజర్ స్థాయి ఉద్యోగులు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ల మీద పడనుంది. గూగుల్ రానున్న రోజుల్లో 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవలే వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో నెలకొన్న పోటీని ఎదుర్కోవడానికి, ఓపెన్ఏఐ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)