మూడేళ్లలో మూడింతల ఆదాయం

Published on Thu, 12/26/2024 - 12:24

న్యూఢిల్లీ: కార్‌ సర్వీసెస్ (Car service), రిపేర్‌ (Car repair) ప్లాట్‌ఫామ్‌ గోమెకానిక్‌ (GoMechanic) మూడేళ్లలో నికర ఆదాయం మూడింతలకుపైగా అధికమై రూ.700 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ఆ తర్వాత పబ్లిక్‌ లిస్టింగ్‌కు (IPO) వెళ్తామని కంపెనీ కో–ఫౌండర్, సీఈవో హిమాన్షు అరోరా తెలిపారు. ప్రస్తుతం 3 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉన్నామని, మూడేళ్లలో దీనిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ద్విచక్ర, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ సర్వీసెస్‌ విభాగంలోకి ప్రవేశిస్తామన్నారు.

‘కంపెనీ ప్రస్తుతం 125 నగరాల్లో 800 గరాజ్‌ల ద్వారా సేవలను అందిస్తోంది. 2027 నాటికి 500 నగరాల్లో 2,500 గరాజ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని వివరించారు. గతంలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు బయటపడడంతో కంపెనీని ఇన్వెస్టర్లు అమ్మకానికి పెట్టారు. లైఫ్‌లాంగ్‌ గ్రూప్‌ అనుబంధ కంపెనీ సర్వీజ్జీ 2023 మార్చిలో గోమెకానిక్‌ను కొనుగోలు చేసింది.  

8 లక్షల మంది కస్టమర్లు.. 
గోమెకానిక్‌ 2023–24లో రూ.210 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌లో రూ.85 కోట్లు నమోదు చేసింది. ‘విడిభాగాలు, ఉపకరణాల అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. వీటి విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.432 కోట్లు నమోదయ్యే అవకాశం ఉంది. నికర రాబడి దాదాపు రూ.200 కోట్లకు చేరుకుంటాం’ అని అరోరా చెప్పారు. యాక్టివ్‌ కస్టమర్లు నెలకు 8 లక్షలు ఉన్నారని గోమెకానిక్‌ కో–ఫౌండర్, సీవోవో ముస్కాన్‌ కక్కర్‌ వివరించారు. నిర్వహణ లాభం నమోదు చేస్తున్నామని, 2027 నాటికి నికరలాభం అందుకుంటామని ఆమె వెల్లడించారు. కంపెనీ రోల్స్‌పై 550 మంది, ఫ్రాంచైజీ నెట్‌వర్క్‌లో 4,000 మంది పనిచేస్తున్నారని వివరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)