Breaking News

పసిడి.. మళ్లీ రూ.లక్ష పైకి!

Published on Wed, 07/23/2025 - 03:03

న్యూఢిల్లీ: పుత్తడి మరోసారి జిగేల్‌మంది. కొనుగోళ్ల మద్దతుతో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర మంగళవారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 లాభపడి రూ.1,00,020 స్థాయికి చేరింది. స్టాకిస్టుల నుంచి బలమైన కొనుగోళ్లు జరిగినట్టు ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,000 పెరిగి రూ.99,550 స్థాయిని చేరుకుంది.

అటు వెండిలోనూ కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో రూ.3,000 లాభపడి కిలోకి రూ.1,14,000 స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో (కామెక్స్‌ ఫ్యూచర్స్‌) ఔన్స్‌ బంగారం 35 డాలర్లకు పైగా లాభంతో 3,440 డాలర్ల స్థాయిని చేరుకుంది. వెండి ధర ఔన్స్‌కు 39.50 డాలర్ల వద్ద ఉంది. పరపతి విధానంపై యూఎస్‌ ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ ప్రసంగం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచి చూస్తున్నట్టు అబాన్స్‌ ఫైనాన్షియల్‌ సర్విసెస్‌ సీఈవో చింతన్‌ మెహతా తెలిపారు.

చైనా లోన్‌ ప్రైమ్‌ రేటుపై నిర్ణయం, యూఎస్‌ ఆర్థిక డేటా (పీఎం, డ్యూరబుల్‌ గూడ్స్‌ ఆర్డర్లు), వడ్డీ రేట్లపై నిర్ణయాలు అంతర్జాతీయంగా బంగారంలో తదుపరి ర్యాలీని నిర్ణయిస్తాయని ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్విసెస్‌ కమోడిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రియా సింగ్‌ అభిప్రాయపడ్డారు.  

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)