పసిడి కొనుగోలుదారులకు ఊరట..

Published on Mon, 06/24/2024 - 11:04

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల క్రితం భారీగా తగ్గిన బంగారం ధరలు నిన్నటి రోజున స్థిరంగా కొనసాగాయి. ఈరోజు (జూన్‌ 24) పసిడి ధరలు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర ఈరోజు రూ.100 తగ్గి రూ.66,250 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు తగ్గింది.

దేశంలోని ఇతర నగరాల్లో..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,400 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.150 క్షీణించి రూ.73,380 లకు చేరింది. 

  • ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.100 తగ్గి రూ.66,250 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు దిగొచ్చింది.

  • బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు తగ్గింది.

  • చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.50 పెరిగి రూ.67,000 ల​కు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.60 పెరిగి రూ.73,100 లకు చేరింది.

వెండి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 చొప్పున తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,200లకు దిగొచ్చింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)