హమ్మ‍య్య.. బంగారం, వెండిపై భారీ శుభవార్త!

Published on Sat, 06/22/2024 - 12:19

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నేడు హమ్మయ్య అనిపించాయి. రెండు రోజులుగా పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు శాంతించాయి. క్రితం రోజున రూ.800 మేర పెరిగిన పసిడి ధరలు ఈరోజు (జూన్‌ 22) అదే స్థాయిలో దిగివచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు తగ్గింది.

ఇతర నగరాల్లో.. 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.800 తగ్గి రూ.66,500 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.870 క్షీణించి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు దిగొచ్చింది.

బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.850 తగ్గి రూ.66,950 ల​కు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.930 తగ్గి రూ.73,970 లకు క్షీణించింది.

భారీగా దిగొచ్చిన వెండి
దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి గణనీయంగా రూ.2000 చొప్పున పతనమైంది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500లకు దిగొచ్చింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)