మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
పసిడి ప్రియులకు షాక్.. రూ.4600 పెరిగిన బంగారం!
Published on Fri, 09/04/2026 - 16:03
తగ్గేదేలే అన్నట్లు.. బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో రెండు రోజుల్లోనే గోల్డ్ రేటు గరిష్టంగా 4640 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో పసిడి ధరల్లో ఊహకందని మార్పు కనిపించింది.
హైదరాబాద్, విజయవాడలలో సెప్టెంబర్ 2న రూ.1,52,020 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఈ రోజుకు 1,56,660 రూపాయల (రూ.4640 పెరిగింది) వద్ద నిలిచింది. 22 క్యారెట్ల రేటు 1,39,350 రూపాయల నుంచి రూ.1,43,600 వద్దకు (రూ.4250 పెరిగింది) చేరింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరులలో కూడా కొనసాగాయి.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రెండు రోజుల్లో రూ. 4640 పెరిగి రూ. 1,56,660 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 4250 పెరిగి రూ.1,43,600 వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా బంగారం ధర భారీగా పెరిగింది.
ధరలు పెరగడానికి కారణాలు
బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్ పెరగడమే. డిమాండుకు తగిన గోల్డ్ అందుబాటులో లేనప్పుడు, కొనుగోలుదారులు ఎక్కువైనప్పుడు తప్పకుండా ధరల్లో గణనీయమైన మార్పు జరుగుతాయి. రాజకీయ, భౌగోళిక కారణాలు కూడా పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి.
Tags : 1