Breaking News

ఇదే మంచి అవకాశం!.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Published on Sun, 07/28/2024 - 20:35

ఇటీవల ప్రవేశపెట్టిన మోదీ 3.0 బడ్జెట్‌లో బంగారం మీద ట్యాక్స్ 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తరువాత పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. జులై 23 నుంచి ఇప్పటి వరకు తులం గోల్డ్ రేటు గరిష్టంగా ఐదువేల రూపాయలు తగ్గింది. గణనీయంగా తగ్గిన ధరలు మళ్ళీ పెరుగుతాయని బులియ‌న్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తగ్గుతున్న బంగారం ధరలు మరికొన్ని రోజుల్లో భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే బంగారం కొనుగులు చేయడానికి సన్నద్ధమవ్వాలని, రాబోయే రోజులు ఇది మంచి లాభాలను తెచ్చిపెడుతుందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు జతీన్ త్రివేది అన్నారు.

24 క్యారెట్ల బంగారం 7500 రూపాయల నుంచి 6900 రూపాయలకు చేరింది. అంటే ఒక వారం రోజుల్లోనే ఒక గ్రామ్ గోల్డ్ రేటు 600 రూపాయలు తగ్గింది. ధరల తగ్గుదల అందరినీ ఆకర్షిస్తుంది. దీంతో తప్పకుండా రాబోయే రోజుల్లో పసిడి ధరలు పెరుగుతాయని గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ & పరిశోధకులు సర్వేంద్ర శ్రీవాస్తవ అన్నారు.

ఈ రోజు బంగారం ధరల విషయానికి వస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పసిడి ధరలు ఉలుకు పలుకు లేకుండా అన్నట్లు స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబద్, విజయవాడలో గోల్డ్ రేటు రూ. 69000 (24 క్యారెట్స్ 10 గ్రా), రూ. 63250 (22 క్యారెట్ 10 గ్రా) వద్ద ఉంది. వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. దీంతో కేజీ వెండి రూ. 84500 వద్ద ఉంది.

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి