Breaking News

బెంబేలెత్తిస్తున్న ప్రముఖ బ్యాంక్‌ రిపోర్ట్‌

Published on Thu, 09/04/2025 - 17:01

ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఐసీఐసీఐ బ్యాంక్ అంచనా ప్రకారం 2026 ప్రథమార్థం చివరి నాటికి భారతదేశంలో బంగారం ధరలు రూ.1,25,000 వరకు పెరగవచ్చని చెబుతోంది. 2025లో ఇక మిగిలిన ఏడాది పది గ్రాముల బంగారం ధర రూ.99,500 నుంచి రూ.1,10,000 మధ్య ట్రేడవుతుందని, 2026 ప్రథమార్థంలో ఇది రూ.1,10,000 నుంచి రూ.1,25,000 వరకు పెరుగుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ రీసెర్చ్ నోట్ తెలిపింది.

‘మా అంచనాల కంటే అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి చాలా క్షీణించిన స్థాయిలో ట్రేడ్ అయితే ఈ అంచనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ కాలానికి డాలర్‌తో రూపాయి మారక విలువ సగటున 87.00 - 89.00 మధ్య ఉంటుందని అంచనా వేశాం’ అని నివేదిక పేర్కొంది.

అంతర్జాతీయ ప్రభావాలు  
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య సడలింపు అంచనాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థపై నిరంతర సంస్థాగత ఆందోళనల మద్దతుతో 2025లో ఇప్పటివరకు ప్రపంచ బంగారం ధరలు 33 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. ప్రపంచ బులియన్ 2025లో సగటున ఔన్స్‌కు 3,400-3,600 డాలర్లు, 2026 ప్రథమార్థంలో ఔన్స్‌కు 3,600-3,800 డాలర్లకు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమైతే, ఈ పరిధులు మరింత తారుమారయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

దేశీయ కారణాలు  
రూపాయి బలహీనపడటం (డాలర్‌తో పోలిస్తే రూ.87 –రూ.89 మధ్యగా ఉంటుందని అంచనా ) 
పండుగల కాలంలో బంగారం డిమాండ్ పెరగడం.
బంగారం దిగుమతులు పెరగడం (జూన్ 2025లో 1.8 బిలియన్  డాలర్లు, జూలై 2025లో 4.0 బిలియన్  డాలర్లు)
గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు అధికం కావడం ( జూలైలో రూ.1,260 కోట్లు, 2025లో ఇప్పటివరకు రూ.9,280 కోట్లు, 2024లో రూ.4,520 కోట్లు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)