Breaking News

అసలు తగ్గింపు ఇక నుంచే.. శ్రావణం ముంగిట శుభవార్త!

Published on Thu, 08/01/2024 - 18:54

శ్రావణ మాసం వస్తోంది. అసలే పెళ్లిళ్ల సీజన్‌. అదీకాక శుభకార్యాలు అధికంగా జరిగేది ఈ నెలలోనే. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేసేవారికి ఇది నిజంగా శుభవార్త. అది ఏంటంటే..

ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం దిగుమతి సుంకాల తగ్గింపును అమలు చేయడంతో బంగారం ధరలు 9% తగ్గుతాయని అంచనా. తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తవడంతో గురువారం నుంచి తక్కువ ధరలో బంగారం మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ప్రభావం కొన్ని రోజులుగా బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి నుంచి బంగారం ధరలు రూ.4,000 మేర తగ్గాయి. అయితే అవసరమైన కస్టమ్స్ విధానాల కారణంగా ప్రకటన అమల్లోకి రావడానికి  కొంత సమయం పట్టింది. ఇప్పుడు ఈ ఫార్మాలిటీలన్నీ పూర్తయినందున సవరించిన దిగుమతి సుంకం ప్రకారం బయటి నుంచి బంగారం భారత్‌ చేరుకోవడం ప్రారంభమవుతుంది. ఆగస్టు 1 నుంచి రిటైల్ అమ్మకానికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

ఎంత మేర తగ్గుతాయి?
కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తి కావడానికి వారం రోజుల సమయం పట్టిందని ఆల్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి తగ్గిన దిగుమతి సుంకం ప్రకారం బంగారం దేశంలోకి రావడం ప్రారంభమవుతుంది. ఇది రిటైల్ బంగారం ధరలపై ప్రభావం చూపనుంది. దిగుమతి సుంకంలో 9% తగ్గింపుతో తులం (10 గ్రాములు) బంగారంపై రూ. 5,000 నుంచి రూ. 6,000 తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

దిగుమతి సుంకం తగ్గింపు బంగారం బ్లాక్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని యోగేష్ సింఘాల్ పేర్కొన్నారు. అధిక సుంకం కారణంగా ఆభరణాల వ్యాపారులు అక్రమ దిగుమతి పద్ధతులు అవలంభించేవారు. దీంతో ఆ భారాన్ని కస్టమర్ల మీద వేసేవారు. ఈ రూపంలో వినియోగదారుల నుంచి 15% వసూలు చేసేవారు. ఇప్పుడు సుంకం తగ్గడంతో అక్రమ పద్ధతులకు నగల వ్యాపారులు స్వస్తి పలికే అవకాశం ఉంటుంది. దీంతో ఆ అదనపు భారం కూడా కస్టమర్లపై తగ్గుతుందని భావిస్తున్నారు.

 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)