Breaking News

పసిడి రూ.4,800 పతనం

Published on Thu, 06/18/2026 - 03:51

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన పవనాలు, బలమైన రూపాయి వెరసి పసిడి, వెండి బుధవారం భారీగా నష్టపోయాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.4,800 తగ్గి రూ.1,54,400 స్థాయికి దిగొచ్చింది. వెండి సైతం కిలోకి రూ.5,300 నష్టపోయి రూ.2,55,400 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన పనితీరు నేపథ్యంలో వరుసగా రెండో రోజు దేశీ బులియన్‌ మార్కెట్లో బలహీన ధోరణి నెలకొన్నట్టు విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ముఖ్యంగా కొత్త చైర్మన్‌ కెవిన్‌ వార్‌‡్ష సారథ్యంలో యూఎస్‌ ఫెడ్‌ తొలి సమావేశం వివరాలు బుధవారం విడుదల కానున్నాయి.

వడ్డీ రేట్లపై కొత్త చైర్మన్‌ వ్యాఖ్యలు ఎలా ఉంటాయన్నది ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. బుధవారం రాత్రి (భారత కాలమానం) యూఎస్‌ ఫెడ్‌ నిర్ణయాలు వెల్లడి కానుండడంతో బంగారం ధర స్పాట్‌ మార్కెట్‌లో స్థిరీకరణను చూసినట్టు మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ కమోడిటీస్‌ హెడ్‌ ప్రవీణ్‌సింగ్‌ తెలిపారు. ముఖ్యంగా యూఎస్‌–ఇరాన్‌ ఇంకా ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉన్న విషయం గమనార్హం.

వచ్చే శుక్రవారం ఇది చోటు చేసుకుంటుందని అంచనా. ఈలోపు ఎలాంటి పరిణామాలు ఉంటాయేమోనన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. ఔన్స్‌ బంగారం ధర 4,396 డాలర్లు, వెండి ధర 71.5 డాలర్ల వద్ద ఉన్నాయి.  

Videos

దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం

లోకేష్‌ను అడ్డుకున్న గ్రామస్తులు.. ఎందుకంటే ?

Pulivendula : ఇసుక వేస్తే రాలనంత జనం

జేసీ అనుచరుల కంటే పోలీసులే నీచంగా ప్రవర్తిస్తున్నారు

CI నాగరాజు ఫోన్ ఎక్కడ..? శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!

నీకెందుకు తల్లి మేకప్ మేకప్ అంటే నీకు ప్యాకప్ ఖాయం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి... క్రికెటర్ అభిషేక్‌పై మహిళ కేసు

76 ఏళ్లు వచ్చాయి... సిగ్గులేదు! సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

చంపేందుకే లోహగఢ్ ట్రెక్కింగ్ ప్లాన్ CCTV కెమెరాలో అంతా రికార్డ్

లాకప్ డెత్ చంద్రబాబు ఎలా కప్పిపుచ్చారు..? అసలు నిజాలివే..!

Photos

+5

పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)

+5

సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు

+5

గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్

+5

కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు)

+5

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు)

+5

టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల సందడి...స్పెషల్‌ అట్రాక్షన్‌గా తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్.. చిరు-చరణ్ స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)