Breaking News

బాంబుల్లా పేలుతున్న బంగారం ధరలు: తారాజువ్వలా మరింత పైకి..

Published on Wed, 10/30/2024 - 11:30

రోజు రోజుకి బంగారం ధరలు తారాజువ్వలా దూసుకెళ్తున్నాయి. ఈ రోజు (30 అక్టోబర్) కూడా పసిడి ధర గరిష్టంగా రూ. 710 పెరిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనేది వివరంగా చూసేద్దాం..

హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 81,160 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 74,400 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేడు ధరలు రూ. 650, రూ. 710 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.

చెన్నైలో కూడా పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధర రూ. 650, రూ. 710 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 81,160 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 74,400 వద్ద ఉంది.

ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు భారీగానే పెరిగాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో ధరలు కొంత ఎక్కువ. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,550 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 81,310 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగింది.

సిల్వర్ ధరలు
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,09,000 వద్ద నిలిచింది. నిన్న రూ. 100 తగ్గిన సిల్వర్ రేటు ఈ ఒక్క రోజే రూ. 2100 పెరిగింది. ధరలు ఇలాగే కొనసాగితే.. వెండి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే ధరలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)