Breaking News

పసిడి మరో కొత్త రికార్డు.. ఒకే రోజు రూ.1,650 ర్యాలీ

Published on Thu, 04/17/2025 - 07:12

న్యూఢిల్లీ: పసిడి మరోసారి కొత్త గరిష్ట రికార్డును నమోదు చేసింది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9% స్వచ్ఛత) రూ.1,650 పెరగడంతో రూ.98,100 స్థాయికి చేరింది. క్రితం రికార్డు రూ.96,450ను చెరిపేసింది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతుండడం బంగారం ధరలకు ఆజ్యం పోస్తోంది.

బంగారం ఈ నెల 11న ఒక్క రోజే 10 గ్రాములకు రూ.6,250 పెరగడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటి వరకు 23.56 శాతం ర్యాలీ చేసింది. జనవరి 1న రూ.79,390 స్థాయి నుంచి చూస్తే 10 గ్రాములకు రూ.18,710 లాభపడింది. మరోవైపు వెండి కిలోకి రూ.1,900 పెరిగి రూ.99,400కు చేరింది.

‘‘బంగారం మళ్లీ భారీ ర్యాలీ చేసింది. ఎంసీఎక్స్‌లో రూ.95,000 స్థాయిని చేరింది.  సురక్షిత సాధనానికి ఉన్న బలమైన డిమాండ్‌ను ఇది తెలియజేస్తోంది’’అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ కమోడిటీ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జతిన్‌ త్రివేది తెలిపారు.

భౌగోళిక అనిశ్చితులకుతోడు అమెరికా–చైనా మధ్య  టారిఫ్‌ ఉద్రిక్తతలు చల్లారనంత వరకు బంగారం ర్యాలీకి అవకాశాలున్నట్టు చెప్పారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 105 డాలర్లు పెరిగి 3,349 డాలర్ల సరికొత్త ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని తాకింది.

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు