Breaking News

బంగారం ఇంకెంత పెరుగుతుంది?

Published on Mon, 07/21/2025 - 15:34

బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తులం (10 గ్రాములు) పసిడి ధర రూ.లక్ష దాటేసింది. అంతర్జాతీయంగా ఔన్స్‌ బంగారం ధర  3,350 డాలర్ల వద్ద ఉంది. అయితే రాబోయే రోజుల్లో పుత్తడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బులియన్ ధరను నడిపించే అనేక అంశాలు రానున్న రోజుల్లో ఉన్నాయని చెబుతున్నారు.

ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఏం మాట్లాడతారు.. అమెరికా, బ్రిటన్, యూరోజోన్ సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థల గ్లోబల్ పీఎంఐ డేటా వంటి అంశాలను ట్రేడర్లు నిశితంగా పరిశీలించనున్నారు. బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయనేదానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటిలో ఏ అంశాలు బంగారం ధరకు అనుకూలంగా పనిచేసినా పసిడి రేటు పెరుగుతుంది.

అమెరికా ప్రకటించినా ప్రతీకార సుంకాల అమలు తేదీ ఆగస్టు 1 డెడ్‌లైన్ సమీపిస్తుండటంతో వాణిజ్య చర్చలపై అనిశ్చితి బంగారం సేఫ్ హెవెన్ డిమాండ​్‌కు ఊతమిచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దేశీయ పండుగల డిమాండ్ కూడా బంగారం ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తుందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈబీజీ - కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ తెలిపారు.

వెంచురా కమోడిటీ అండ్ సీఆర్ఎం హెడ్ ఎన్ఎస్ రామస్వామి ప్రకారం.. బలహీనమైన యూఎస్ డాలర్, భౌగోళిక రాజకీయ నష్టాలు, బలమైన పెట్టుబడిదారుల డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కొనసాగడం వంటి సరైన ఉత్ప్రేరకాలు కార్యరూపం దాలిస్తే, 2025 ప్రథమార్ధంలో బలమైన 26 శాతం పెరుగుదల తర్వాత ద్వితీయార్ధంలోనూ బంగారం మరో 4-8 శాతం లాభపడవచ్చు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)