Breaking News

దీపావళి తర్వాత బంగారం తగ్గుతుందా? అంతర్జాతీయ బ్యాంకు అంచనా

Published on Tue, 10/21/2025 - 17:49

బంగారం ధరలు ఆగకుండా దూసుకెళ్తున్నాయి. రోజుకో కొత్త రేటుకు చేరుతున్నాయి. ధనత్రయోదశి, దీపావళి (Diwali) రోజుల్లో కాస్త తగ్గినట్లే అనిపించినా మళ్లీ ఎగిశాయి. ఈ క్రమంలో దీపావళి తర్వాత బంగారం ధరలు ఏమైనా తగ్గే అవకాశం ఉందా అని చాలామంది కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. కానీ అలాంటి అవకాశం ఇప్పట్లో లేదని తెలుస్తోంది.

హెచ్ఎస్‌బీసీ అంచనా
అంతర్జాతయ బ్యాంకు అయిన హెచ్ఎస్‌బీసీ (HSBC) తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. బంగారం ధరలు (Gold Price) ఇప్పట్లో మందగించే అవకాశం లేదని సూచించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఇప్పటికే ఔన్స్ కు 4,300 డాలర్లు దాటింది. అక్టోబర్ 18న ఇది ఔన్స్ కు 4,362 ట్రేడ్ అవుతోంది. ఇది స్థిరమైన బుల్లిష్ సెంటిమెంట్‌ను సూచిస్తుంది.

పండుగ రద్దీ తర్వాత కూడా బంగారం తన వేగాన్ని కొనసాగిస్తుందని హెచ్ఎస్‌బీసీ భావిస్తోంది. 2026 ప్రథమార్థం నాటికి బంగారం ఔన్స్ కు 5,000 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తోంది.

అంతకుముందు, హెచ్‌ఎస్‌బీసీ 2025లో ఔన్స్ కు సగటు బంగారం ధర 3,355 డాలర్లుగా అంచనా వేసింది. దాన్ని  ఇప్పుడు 3,455 డాలర్లకు సవరించింది. 2026 కోసం అంచనా  ఔన్సుకు 3,950 డాలర్ల నుండి  4,600 డాలర్లకు పెంచేసింది. రాయిటర్స్ కూడా ఇవే అంచనాలను 
ఉదహరించింది.

బంగారం ధరల పెరుగుదలకు కారణాలు
బంగారం ధరల పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని, గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లో పెట్టుబడులు పెరుగుతున్నాయని, అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బలపడుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రపంచ వాణిజ్య వివాదాలతో ముడిపడి ఉన్న అనిశ్చితులకు లోనుకాని, సురక్షిత-స్వర్గధామ ఆస్తిగా బంగారం కొనుగోలుదారును ఆకర్షిస్తూనే ఉంది.

ఇటీవల స్పాట్ గోల్డ్ వారం రోజుల్లోనే అమాంతం ఎగిసింది. ఇది ఔన్స్ కు 4,300 డాలర్లకు పెరిగింది. 2008 డిసెంబర్ నుండి ఇది వేగవంతమైన వారపు లాభాలలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో 2026 ప్రారంభం వరకు పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీ నమ్ముతోంది. అయితే ఆ సంవత్సరం చివర్లో మాత్రం కొంత కరెక్షన్‌ జరగొచ్చని భావిస్తోంది.

ఇతర బ్యాంకులదీ అదే అంచనా
బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని, మరింత పెరుగుతాయని ఒక్క హెచ్ఎస్‌బీసీ మాత్రమే కాదు.. కొన్ని ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ భావిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, సొసైటీ జనరల్ కూడా రాబోయే సంవత్సరానికి బంగారం ధర ఔన్సుకు  5,000 డాలర్లను చేరుతుందని అంచనా వేశాయి. 2026 జూన్ నాటికి బంగారం ధర 4,600 డాలర్లకు చేరుకుని, ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని ఏఎన్‌జెడ్‌ బ్యాంక్ అంచనా వేసింది.

ఇదీ చదవండి: వారెన్‌ బఫెట్‌ చెప్పిన సక్సెస్‌ సీక్రెట్‌..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)