మళ్ళీ షాకిచ్చిన పసిడి.. భారీగా పెరిగిన ధరలు

Published on Tue, 10/29/2024 - 10:56

ధన త్రయోదశి.. బంగారం కొనుగోలు చేస్తే శుభమని చాలామంది భావిస్తారు. అయితే నేడు పసిడి ధరలు మళ్ళీ తారాస్థాయికి చేరాయి. కాబట్టి దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (మంగళవారం) గోల్డ్ రేట్లు గురించి వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 80,450 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 73,750 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేడు ధరలు రూ. 600, రూ. 650 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.

చెన్నైలో కూడా పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధర రూ. 600, రూ. 650 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 73,750 వద్ద ఉంది.

ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు భారీగానే పెరిగాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో ధరలు కొంత ఎక్కువ. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,900 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 80,600 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు వరుసగా రూ. 600, రూ. 650 పెరిగింది.

ఇదీ చదవండి: 10 నిమిషాల్లో బంగారు, వెండి నాణేల డెలివరీ..

సిల్వర్ ధరలు
బంగారం ధరలు పెరిగినప్పటికీ..  వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,900 వద్ద నిలిచింది. గత మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు రూ. 100 మాత్రమే తగ్గింది. ఇదే ధరలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)