Breaking News

బంగారం ఇంకా ఎంత పెరుగుతుంది?

Published on Mon, 04/21/2025 - 07:02

నేను పదవీ విరమణ తీసుకున్నాను. ఉద్యో గ విరమణ తర్వాత వచ్చిన ప్రయోజనాలన్నింటినీ స్థిరమైన ఆదాయం కోసం.. ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్‌ ఫండ్స్‌ లేదంటే బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ లేదా అచ్చమైన ఈక్విటీ ఫండ్స్‌లో ఎందులో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి? - అజయ్‌ ప్రకాష్‌

ఈక్విటీ మార్కెట్ల అస్థిరతలను ఎదుర్కోవడంలో మీకు ఎంత మేరకు అవగాహన ఉన్నదన్న అంశం ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఈక్విటీల్లో గతంలో ఇన్వెస్ట్‌ చేసిన అనుభవం మీకు ఉండి.. మార్కెట్లలో ఆటుపోట్లను (ర్యాలీలు, దిద్దుబాట్లు) చూసి ఉన్నట్టయితే అప్పుడు అక్విటీ ఆధారిత ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇక ఎంత మేరకు ఇన్వెస్ట్‌ చేయగలరు? ప్రతి నెలా మీకు ఎంత ఆదాయం కావాలి? అన్నవి కూడా ఇక్కడ తేల్చుకోవాల్సిన అంశాలు.

పెట్టుబడి నుంచి స్థిరమైన ఆదాయం కోరుకుంటున్నట్టు అయితే అప్పుడు అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడుల్లో ఎలాంటి అనుభవం లేకుండా, చేసే పెట్టుబడిపై ఆదాయం కోరుకుంటుంటే అప్పుడు కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మార్కెట్లో మీకున్న అనుభవం, ఎంత ఆదాయం కోరుకుంటున్నారు? రిస్క్‌ సామర్థ్యం తదితర అంశాల ఆధారంగానే ఎంపిక ఉండాలి.

బంగారం ధర ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయింది. ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుందా? - కృతి వాసన్‌

బంగారం బలంగా ర్యాలీ చేస్తున్నప్పుడు పెట్టుబడులు పెట్టాలని అనిపించడం సాధారణమే. ఈ ఏడాది ఇప్పటికే 23 శాతం ర్యాలీ చేసింది. కానీ, అది ఇంకా ఎంత వరకు పెరుగుతుందన్నది ప్రశ్నార్థకమే. ఇందుకు సరైన సమాధానం చెప్పడం కష్టమే. ఏ అస్సెట్‌ క్లాస్‌ (పెట్టుబడి సాధనం) విషయంలో అయినా ఇదే వర్తిస్తుంది.

మీ పెట్టుబడుల ప్రణాళికకు బంగారం ఎంత మేర ప్రయోజనం కలిగిస్తుందో విశ్లేషించుకోండి. అనిశి్చత పరిస్థితు ల్లో బంగారం మంచి పనితీరు చూపిస్తుంటుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయినప్పుడు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, ఈక్విటీ మార్కెట్లలో కల్లోల పరిస్థితులు నెలకొన్నప్పుడు బంగారం ర్యాలీ చేస్తుంటుంది. ఒక్కసారి ఈ పరిస్థితులు అన్నీ కుదుటపడితే అక్కడి నుంచి బంగారం పెరుగుదల పరిమితంగానే ఉంటుంది.

ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?

గత పదిహేనేళ్ల కాలంలో చూసుకుంటే బంగారం ఏటా 10 శాతం రాబడిని అందించింది. అదే ఫ్లెక్సీక్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏటా 12 శాతం రాబడులను అందించాయి. రాబడుల్లో వ్యత్యాసం చూడ్డానికి ఎక్కువగా లేదు. కానీ, దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌ ప్రయోజనంతో ఫండ్స్‌లో పెట్టుబడి వృద్ధి ఎక్కువగా ఉంటుంది. విలువను సృష్టించే వ్యాపారాల్లో వాటాను సొంతం చేసుకునేందుకు ఈక్విటీ పెట్టుబడులు వీలు కల్పిస్తాయి. బంగారం కేవలం నిల్వకే పరిమితం అవుతుంది. బంగారం దీర్ఘకాలంలో సంపద సృష్టించే సాధనం కాదు. హెడ్జ్‌ సాధనంగా పరిగణించి తమ పెట్టుబడుల్లో 10 శాతం వరకు బంగారానికి కేటాయించుకోవచ్చు.

ధీరేంద్ర కుమార్‌, సీఈవో - వ్యాల్యూ రీసెర్చ్‌.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)