Breaking News

గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయ్‌.. ఇకపై ఏం జరగబోతోంది?

Published on Sun, 10/18/2026 - 19:55

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వాలపై పెరుగుతున్న అప్పుల భారం, డాలర్‌ విలువలో మార్పులు.. ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు.. పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో పసిడి ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

ద్రవ్యోల్బణం పెరుగుతుందా?
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రాబోయే సమావేశాల్లో వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు.. పసిడి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఒకే రోజు బంగారం ధర దాదాపు 2 శాతం పడిపోయి ఔన్సుకు 4,075 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచితే, డాలర్‌కు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బాండ్లపై వచ్చే రాబడులు కూడా ఆకర్షణీయంగా మారతాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారంలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర మార్గాల వైపు మొగ్గు చూపవచ్చు. ఫలితంగా పసిడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.

సురక్షితమైన పెట్టుబడిగా బంగారం
అయితే.. ప్రస్తుత పరిస్థితులనే బంగారం ధరల భవిష్యత్తుకు పూర్తిస్థాయి సంకేతంగా చూడలేమని కొందరు ఫండ్‌ మేనేజర్లు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు తమ డబ్బుకు సురక్షితమైన పెట్టుబడులతో (గోల్డ్) ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి సమయంలో బంగారానికి డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే.. ప్రస్తుతం ధరలు తగ్గుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో మళ్లీ అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ట్రాయ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ మేనేజర్‌ షార్లెట్‌ యంగ్‌ అంచనా ప్రకారం.. రాబోయే 12 నుంచి 18 నెలల్లో బంగారం ధరలు ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంటాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకునే అనూహ్య నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లలో అస్థిరతను పెంచే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులే బంగారానికి డిమాండ్‌ పెంచుతాయని చెబుతున్నారు.

ఇదీ చదవండి: పండగొచ్చిందని బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)