Breaking News

రూ.91 వేల దిగువకు పసిడి

Published on Thu, 04/10/2025 - 06:58

న్యూఢిల్లీ: స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి డిమాండ్‌ తగ్గడంతో పసిడి ధర బుధవారం రూ. 1,050 మేర క్షీణించింది. న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 90,200కి దిగి వచ్చింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత బంగారం కూడా అంతే తగ్గి రూ. 89,750కి పరిమితమైంది.

వెండి ధర మాత్రం కేజీకి రూ. 500 పెరిగి రూ. 93,200కి చేరింది. వాణిజ్య యుద్ధాలు ప్రపంచ ఎకానమీని మాంద్యంలోకి తోసేస్తాయనే భయాలతో అంతర్జాతీయంగా మాత్రం పసిడి ధర పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు.

అంతర్జాతీయంగా బంగారం రేటు ఒక దశలో ఔన్సుకు (31.1 గ్రాములు) సుమారు 3,103 డాలర్ల స్థాయిని తాకింది. అమెరికా విధించిన 104 శాతం టారిఫ్‌లకు ప్రతీకారంగా చైనా 84 శాతానికి సుంకాలను పెంచుతామంటూ ప్రకటించడం వాణిజ్య యుద్ధానికి మరింత ఆజ్యం పోసింది. చైనా టారిఫ్‌లు ఏప్రిల్‌ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)