Breaking News

మరింత పెరగనున్న బంగారం కొనుగోళ్లు: సంచలన రిపోర్ట్

Published on Thu, 12/19/2024 - 19:52

విలువ పరంగా దేశీయ బంగారు ఆభరణాల వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) కూడా పటిష్టంగా ఉంటుందని రేటింగ్‌ ఏజెన్సీ- ఇక్రా పేర్కొంది. విలువ రూపంలో వినియోగం 14  శాతం నుంచి 18 శాతం వృద్ధి చెందుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. 2023–24లో ఈ వృద్ధి రేటు 18 శాతంగా నివేదిక తెలిపింది.

ఇక్రా నివేదిక ప్రకారం, బంగారం ధరలు అస్థిరంగా ఉన్నప్పటికీ వినియోగదారుల డిమాండ్‌ తగ్గలేదు. పండుగ నేపథ్యంలో.. ఇటీవలి నెలల్లో మరింత పెరిగిందని తెలిసింది. 2024 జూలైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో 9% మేర (15 నుంచి 6 శాతానికి) దిగుమతుల సుంకం తగ్గడం,  బంగారం ధరల్లో తాత్కాలిక ధరల కట్టడికి దారితీసిందని ఇది రెండవ త్రైమాసికంలో భారీ కొనుగోళ్లకు దారితీసిందని నివేదిక వివరించింది. ప్రత్యేకించి ఆభరణాలతోపాటు, నాణేలు, కడ్డీల కొనుగోళ్లూ పెరిగా యని వివరించింది. పండుగల సీజన్‌ కూడా పసిడి డిమాండ్‌కు కలిసి వచ్చిన అంశంగా పేర్కొంది.  

పెరుగుతున్న దిగుమతులు..
భారత్‌ బంగారం దిగుమతులు సైతం భారీగా పెరుగుతుండడం గమనార్హం. భారత్‌ బంగారం దిగుమతులలో 40 శాతంతో స్విట్జర్లాండ్‌ అతిపెద్ద వాటా కలిగిఉంది. యూఏఈ వాటా 16% కాగా, దక్షిణాఫ్రికా వాటా 10%గా ఉంది. దేశంలోకి వచ్చీ – పోయే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్‌ అకౌంట్‌పై పసిడి కొనుగోళ్ల (దిగుమతుల) ప్రభావం కనబడుతోంది.

2023–24లో భారత్‌ పసిడి దిగుమతుల విలువ 30% పెరిగి 45.54 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. యునైటెట్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ) నుంచి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ తయారీదారులు, వ్యాపారులు రాయితీ రేటుతో 160 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడనికి ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతదేశం - యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 140 టన్నులు ఈ తరహాలో నోటిఫై అయ్యింది.

ఎకానమీకి సవాలు: జీటీఆర్ఐ
దేశంలోకి భారీగా పసిడి దిగుమతులు వాణిజ్య సమతౌల్యకు, కరెంట్‌ అకౌంట్‌ లోటుకట్టు తప్పడానికి.. తద్వారా ఎకానమీ పురోగతిని దెబ్బతీయడానికి దారితీసే అంశమని ఆర్థిక విశ్లేషణా సంస్థ–జీటీఆర్‌ఏ ఒక నివేదికలో పేర్కొంది. పసిడి దిగుమతుల విలువ పెరగడం ఆందోళనకరమైన విషయమని జీటీఆర్‌ఐ ఫౌండర్‌ అజయ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం నవంబర్‌లో  పసిడి దిగుమతుల విలువ ఆల్‌టైమ్‌ హై 14.8 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2023 నవంబర్‌లో ఈ విలువ 3.5 బిలియన్‌ డాలర్లు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)