Breaking News

గోల్డ్‌ ఈటీఎఫ్‌లు.. జిగేల్‌! ఏకంగా రూ.2,081 కోట్లు

Published on Fri, 07/11/2025 - 10:09

బంగారం ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు)కు జూన్‌లో బలమైన డిమాండ్‌ కనిపించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవలి కాలంలో స్థిరమైన ర్యాలీ చేస్తుండడం ఇన్వెస్టర్లను మరింతంగా ఆకర్షిస్తోంది. జూన్‌ నెలలో ఏకంగా రూ.2,081 కోట్లను గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేశారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది.

ఈ ఏడాది మే నెలలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.292 కోట్లతో పోల్చి చూస్తే జూన్‌లో ఏడింతలైనట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.6 కోట్లు, మార్చిలో రూ.77 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ కాలాన్ని పరిశీలించి చూస్తే గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.8,000 కోట్లుగా ఉన్నాయి.

ఈ ఏడాది జనవరిలో గోల్డ్‌ ఈటీఎఫ్‌లు రూ.3,751 కోట్లను ఆకర్షించగా, ఆ తర్వాత తిరిగి జూన్‌లోనే గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం గమనించొచ్చు. జూన్‌లో రెండు గోల్డ్‌ ఈటీఎఫ్‌లు మొదటిసారి మార్కెట్లోకి వచ్చి (ఎన్‌ఎఫ్‌వోలు) ఇన్వెస్టర్ల నుంచి రూ.41 కోట్లను సమీకరించాయి. జూన్‌ చివరికి గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తుల విలువ మే చివరితో పోల్చి చూసినప్పుడు 4%పెరిగి (మే చివరి నుంచి) రూ.64,777 కోట్లకు చేరింది.

స్థిరమైన ధరలు, అనిశ్చిత పరిస్థితులు..

‘‘జూన్‌లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి బలమైన పెట్టుబడులు రావడం సెంటిమెంట్‌లో మార్పునకు నిదర్శనం. ధరలు స్థిరంగా ఉండడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఈక్విటీ, డెట్‌ సాధనాల్లో అస్థిరతలు ఇందుకు కారణమై ఉండొచ్చు’’అని మారి్నంగ్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ నేహల్‌ మెష్రామ్‌ తెలిపారు. కొత్త పథకాల ద్వారా నిధుల సమీకరణ కూడా మెరుగ్గానే ఉన్నట్టు చెప్పారు.

గోల్డ్‌ ఈటీఎఫ్‌ల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా పేర్కొన్నారు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు సంబంధించి ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) జూన్‌లో 2.85 లక్షలు పెరిగాయి. మొత్తం ఫోలియోలు 76.54 లక్షలకు చేరాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ధరలు బంగారం మార్కెట్‌ ధరలనే ప్రతిఫలిస్తుంటాయి. ఒక ఈటీఎఫ్‌ యూనిట్‌ గ్రాము బంగారంతో సమానం. కానీ, కొన్ని ఫండ్స్‌ సంస్థలు ఇంతకంటే తక్కువ పరిమాణంలోనూ పెట్టుబడులకు అనుమతిస్తున్నాయి.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)