Breaking News

వెండి స్పీడు.. పసిడి దూకుడు.. భారీ ధరలు

Published on Sun, 01/11/2026 - 12:59

బంగారం, వెండి ధరలు పూట పూటకూ మారిపోతున్నాయి. రోజుకో కొత్త రేటును నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పసిడి, వెండి ధరలు గడిచిన వారం రోజుల్లో ఎలా మారాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.

గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. జనవరి 4 నుంచి జనవరి 11 వరకు బంగారం తో పాటు వెండి ధరల్లో స్పష్టమైన పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

బంగారం ధరల పెరుగుదల ఇలా..

24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర జనవరి 4న రూ.1,35,820 ఉండగా జనవరి 11 నాటికి రూ.1,40,460 లకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.4640 పెరిగింది. ఇక జనవరి 4న రూ.1,24,500 ఉన్న 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర జనవరి 11 నాటికి రూ.1,28,750 లను తాకింది. ఏడు రోజుల్లో రూ.4250 ఎగిసింది.

వెండి దూకుడు

ఇక వెండి ధరలు అయితే బంగారాన్ని మించి అమిత వేగంతో దూసుకెళ్లాయి. వారం రోజుల్లో వెండి ధర కేజీకి ఏకంగా రూ.18 వేలు పెరిగింది. జనవరి 4న రూ.2,57,000 ఉన్న కేజీ వెండి ధర జనవరి 11 నాటికి రూ.2,75,000 లకు చేరింది.

ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు బలపడటం, డాలర్ మారకం విలువల్లో మార్పులు, అలాగే వివాహాలు, శుభకార్యాల నేపథ్యంలో నగలపై డిమాండ్ పెరగడం కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. వెండిపై పరిశ్రమల నుంచి కూడా డిమాండ్ పెరగడం ధరలపై ప్రభావం చూపిందని అంటున్నారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)