Breaking News

షాకిస్తున్న వెండి, బంగారం ధరలు, ఏకంగా రూ. 1100 జంప్‌

Published on Thu, 07/27/2023 - 10:48

Gold And Silver Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్లి పరుగందుకున్నాయి. ఒక వైపు ఎడతెగని వర్షాలతో దేశంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. మరోవైపు బులియన్‌ మార్కెట్లో వెండి, బంగారం ధరలు గురువారం జోరందుకున్నాయి. అంతర్జాతీయ  పరిణామాలు, ద్రవ్యోల్బణం,  ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు కారణమని బులియన్‌ వర్గాలు  చెబుతున్నాయి. (బ్లాక్‌రాక్‌ బ్యాక్‌ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం)

22క్యారెట్ల 10 గ్రాముల పసిడి  ధర రూ. 300 పెరిగి, రూ. 55,450 పలుకుతోంది.  24 క్యారెట్ల బంగాం పది గ్రాములు   330  రూపాయలు ఎగిసి రూ. 60,490కి చేరింది. వెండి కూడా ఇదే  బాటలో  ఉంది.  (మారుతి జిమ్నీని సింగిల్‌ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్‌ వీడియో)

హైదరాబాద్‌ మార్కెట్లె పుత్తడి  పది గ్రాముల  22 క్యారెట్ల ధర రూ. 55,450 గానూ, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490గానూ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో  దాదాపు ఇవే ధరలో కొన సాగుతున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,640గా ఉంది.

వెండి ధగ ధగలు
దేశీయంగా  వెండి ధరలు  కూడా పుంజుకున్నాయి.   వెండి కిలో ధర 1100 రూపాయిలు  ఎగిసింది. హైదరాబాద్‌లో కిలో వెండి 8,1500గా ఉంది.  

అమెరికా ఫెడ్‌  నిర్ణయం
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్‌ రేటు పెంపు మరింత ఆందోళనకు దారి తీసింది. ఫెడ్‌ ఛైర్మన్ జెరోమ్ పావెల్ 25  బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు దీంతో వడ్డీరేటు పెంపు ఉండదన్న ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు జల్లినట్టైంది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోనుందని అంచనాలు ఊపందుకున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)