Breaking News

7రోజుల్లో 7,000 జంప్‌ 

Published on Thu, 09/04/2025 - 00:54

న్యూఢిల్లీ: పుత్తడి నాన్‌స్టాప్‌గా పరుగులు తీస్తోంది. గడిచిన ఏడు రోజుల్లో 10 గ్రాములకు దేశీయంగా రూ.7,000 లాభపడింది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం మరో రూ.1,000 పెరిగి రూ.1,07,070 వద్ద ముగిసింది. పసిడికి దేశీయంగా ఇది నూతన జీవిత కాల గరిష్ట స్థాయి. ఈ నెల 25న పసిడి ధర రూ.1,00,170 వద్ద ఉండడం గమనార్హం. ఇక 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,000 పెరిగి రూ.1,06,200 స్థాయిని తాకింది.

 మరోవైపు వెండి ధర పెద్దగా మార్పు లేకుండా రూ.1,26,100 స్థాయిలో ట్రేడయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ పసిడి 21 డాలర్లకు పైనే పెరిగి సరికొత్త గరిష్ట స్థాయి అయిన 3,618.50 డాలర్లకు చేరుకుంది. ‘‘యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండడం, అమెరికా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు బంగారం ధరల ర్యాలీకి మద్దతునిచ్చాయి. 

ఈ వారం చివర్లో ఓపెక్‌ ప్లస్‌ కూటమి సమావేశం జరగనుంది. ఇటీవలి ఉక్రెయిన్‌ దాడితో రష్యా ఆయిల్‌ ప్రాసెసింగ్‌ సామర్థ్యం 17 శాతం ప్రభావితం కావడంతో సరఫరా పరమైన ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో ఇటీవలి కనిష్టాల నుంచి చమురు ధరలు సైతం పుంజుకున్నాయి’’అని అబాన్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సీఈవో చింతన్‌ మెహతా వివరించారు. ఫెడ్‌ రేటు కోతల అంచనాలకు తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుసరిస్తున్న టారిఫ్‌ విధానాలు పసిడి ధరలను నడిపిస్తున్నట్టు వెంచురా కమోడిటీ హెడ్‌ ఎన్‌ఎస్‌ రామస్వామి సైతం అభిప్రాయపడ్డారు.   
 

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)