Breaking News

పండుగల ముందు  పసిడి పరుగు 

Published on Tue, 09/23/2025 - 04:41

న్యూఢిల్లీ: పండుగల ముందు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు ఏకంగా రూ.2,200 పెరిగి మరో కొత్త జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,16,200కి చేరుకుంది. వెండి సైతం రూ.4,380 ర్యాలీ చేసి కిలోకి రూ.1,36,380 స్థాయిని (కొత్త ఆల్‌టైమ్‌ గరిష్టం) తాకింది. ‘అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న బుల్లిష్‌ ధోరణికి అనుగుణంగా దేశీయంగానూ బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిల్లో ట్రేడయ్యాయి.

 యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు రేట్ల కోతలు ఉంటాయంటూ సంకేతం ఇవ్వడం డాలర్, ట్రెజరీ ఈల్డ్స్‌ బలపడటాన్ని అడ్డుకుంది. ఇది పసిడి, వెండి ధరలకు మద్దతిచి్చంది’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు.  అంతర్జాతీయంగా చూస్తే బంగారం ధర 50 డాలర్లకు పైగా పెరిగి 3,760 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది. ఈ ఏడాది ఇప్పటి దాకా దేశీ మార్కెట్లో పసిడి ధరలు 47%, వెండి ధరలు 52% పెరగడం గమనార్హం. 

అక్టోబర్‌ 21న మూరత్‌ ట్రేడింగ్‌ 
ముంబై: దీపావళి సందర్భంగా స్టాక్‌ ఎక్సే్చంజీలు అక్టోబర్‌ 21న గంట పాటు ప్రత్యేక ‘మూరత్‌ ట్రేడింగ్‌’ నిర్వహించనున్నాయి. మధ్యాహ్నం 1.45 గంటలకు మొదలై 2.45 గంటలకు ట్రేడింగ్‌ ము గుస్తుందని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ  తెలిపాయి. ఈ దీపావళి నుంచి సంవత్‌ 2082 ఆరంభం కానుంది. ఈ పర్వదినం రోజు ట్రేడింగ్‌ చేస్తే.. వచ్చే దీపావళి వరకు లాభాలు వరిస్తాయనే నమ్మకంతో చాలా మంది మూరత్‌ ట్రేడింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. గతేడాది(2024) ప్రత్యేక మూరత్‌ ట్రేడింగ్‌ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించాయి.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)