Breaking News

నేడు తులం బంగారం కొనాలంటే ఎంత కావాలంటే..

Published on Sun, 06/30/2024 - 11:50

పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు రెండురోజులుగా పెరుగుతుండగా ఈరోజు (జూన్‌ 30) ధరల్లో ఎలాంటి మార్పులేదు.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతోపాటు అంతర్జాతీయ బంగారం రేట్లపైనా దేశంలో బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి.

ఇరు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.66,250, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద కొనసాగుతన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,400, 24 క్యారెట్ల బంగారం రూ.72,420 లుగా ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,250, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,850, 24 క్యారెట్ల బంగారం రూ.72,930 లుగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,250 లుగా, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.

వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)