Breaking News

రేటెక్కిన బంగారం.. ఇప్పుడు తులం..

Published on Mon, 06/02/2025 - 10:53

దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices)  తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజులు నిలకడగా కొనసాగిన పసిడి ధరలు నేడు (జూన్‌ 2) పెరుగుదల బాట పట్టాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో  బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. జూన్‌ 2 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..

తెలుగు రాష్ట్రాల్లో..
🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640
🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500
హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.


👉ఇది చదివారా? గోల్డ్‌ లోన్‌ కొత్త రూల్స్‌.. రంగంలోకి ప్రభుత్వం

ఢిల్లీలో.. 
🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,790
🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,650
ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.


చెన్నైలో..
🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640
🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500
చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.


ముంబైలో..
🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640
🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500
ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్‌లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.


బెంగళూరులో..
🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640
🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500
బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.


వెండి ధరలు..
దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు స్వల్ప పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.100 పెరిగి రూ.1,11,000 వద్దకు చేరింది. ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 పెరిగి రూ. 1,00,000 వద్ద కొనసాగుతోంది.

(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

రవితేజ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్

పెనుకొండ తహసీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బొకేను విసిరేసిన మంత్రి సవిత

జగన్ గారి పాలనలో ఎంతో ప్రశాంతంగా ఉన్నాం..

పార్టీ మార్పు పుకార్ల పై అబ్బాయా చౌదరి రియాక్షన్

ఏ పాఠశాలకు వస్తావో రా.. లోకేష్‌కి విద్యార్థుల ఛాలెంజ్

టీడీపీకి అందుకే రాజీనామా చేస్తున్నా

KSR Live Show: నీచంగా దిగజారుతున్న టీడీపీ.. శాతవాహన కాలేజీని కూల్చేసిన పచ్చ మాఫియా

అల్లు అర్జున్, అట్లీ కొత్త మూవీ.. హీరోయిన్ ఎవరంటే ?

టీడీపీకి సీనియర్ నేత రాజీనామా

దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు

Photos

+5

మొత్తానికి శ్రీవారు ప్రపోజ్‌ చేశారు, సీక్రెట్‌ చెప్పిన ‘ప్రేమపావురం​’ (ఫొటోలు)

+5

బన్నీ సరసన దీపికా పదుకొణె.. వారియర్ తరహా పాత్రలో (ఫొటోలు)

+5

చుక్కల చీర.. జడలో మల్లెపూలతో మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్‌ వేడుకలు (ఫొటోలు)

+5

ఏపీలో మండే ఎండలు.. వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి (ఫొటోలు)

+5

'మై లవ్' ఆల్బమ్ సాంగ్ లాంచ్‌లో 'బిగ్‌బాస్' స్టార్స్ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణపతి కర్రపూజ.. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం (ఫొటోలు)

+5

'మ్యాడ్' స్వాతిరెడ్డి ఫ్యామిలీతో థాయ్‌లాండ్ ట్రిప్ (ఫొటోలు)

+5

అఖిల్ పెళ్లిలో టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

పెళ్లయి రెండేళ్లు.. భార్య గురించి సుమలత కొడుకు పోస్ట్ (ఫొటోలు)