Breaking News

అదరగొట్టిన గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌.. నికర లాభంలో 58% వృద్ధి

Published on Thu, 05/04/2023 - 14:21

న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజం గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 412 కోట్లను అధిగమించింది. హౌసింగ్‌కు నెలకొన్న పటిష్ట డిమాండ్‌ ఇందుకు సహకరించింది. 

అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 260 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,523 కోట్ల నుంచి రూ. 1,839 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు ఎన్‌సీడీలు, బాండ్లు తదితర మార్గాల ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా రూ. 2,000 కోట్ల సమీకరించేందుకు అనుమతించింది. చేపడుతున్న ప్రాజెక్టులు, పటిష్ట బ్యాలన్స్‌షీట్, హౌసింగ్‌ రంగ వృద్ధి నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం(2023–24)లోనూ ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్శన్‌ పిరోజ్‌షా గోద్రెజ్‌ అభిప్రాయపడ్డారు. 

ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 571 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. 2021–22లో రూ. 352 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,586 కోట్ల నుంచి రూ. 3,039 కోట్లకు బలపడింది. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 12,232 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్‌ను సాధించింది. 2021–22లో నమోదైన రూ. 7,861 కోట్లతో పోలిస్తే ఇవి 56 శాతం అధికం. నగదు వసూళ్లు 41 శాతం ఎగసి రూ. 8,991 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్‌ ప్రాపరీ్టస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.4 శాతం తగ్గి రూ. 1,323 వద్ద ముగిసింది.
 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)