గోల్డ్ లోన్ రంగంలోకి గోద్రెజ్ క్యాపిటల్!

Published on Thu, 07/23/2026 - 21:17

ఎన్‌బీఎఫ్‌సీ గోద్రెజ్‌ క్యాపిటల్‌ పసిడి రుణాల రంగంలోకి అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కనకదుర్గ ఫైనాన్స్‌ గోల్డ్‌ లోన్‌ వ్యాపారాన్ని రూ.117 కోట్లకు కొనుగోలు చేసింది. తన అనుబంధ సంస్థ గోద్రెజ్‌ ఫైనాన్స్‌ ద్వారా ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది.

2031 నాటికి రూ.1 లక్ష కోట్ల అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏయూఎం)ను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 10 లక్షలకు పైగా వినియోగదారులకు సేవలు అందించాలన్న దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఈ వ్యూహాత్మక కొనుగోలును చేపట్టినట్లు వెల్లడించింది.

కనకదుర్గ ఫైనాన్స్‌ గోల్డ్‌ లోన్‌ విభాగానికి ప్రస్తుతం రూ.280 కోట్ల ఏయూఎం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 54 శాఖలు, దాదాపు 12 వేల మంది వినియోగదారులు, సుమారు 250 మంది అనుభవం కలిగిన ఉద్యోగులు ఉన్నారు. ఈ కొనుగోలుతో గోల్డ్‌ లోన్‌ విభాగంలో కార్యకలాపాలను వేగంగా విస్తరించగలమని గోద్రెజ్‌ క్యాపిటల్‌ తెలిపింది.

తొలి వ్యూహాత్మక కొనుగోలు
‘‘కనకదుర్గ ఫైనాన్స్‌ గోల్డ్‌ లోన్‌ వ్యాపార కొనుగోలు గోద్రెజ్‌ క్యాపిటల్‌ ప్రయాణంలో కీలక మైలురాయి. రాబోయే అయిదేళ్లలో రూ.1 లక్ష కోట్ల ఏయూఎంను లక్ష్యంగా పెట్టుకున్న మా ప్రణాళికలో ఇదే తొలి వ్యూహాత్మక కొనుగోలు’’ అని గోద్రెజ్‌ క్యాపిటల్‌ ఎండీ, సీఈవో మనీష్‌ షా తెలిపారు. ప్రస్తుతం గోద్రెజ్‌ క్యాపిటల్‌ ప్రధానంగా ఎంఎస్‌ఎంఈ రుణాలు, గృహ రుణాల వ్యాపారంలో ఉంది. గత నెలలో గోద్రెజ్‌ క్యాపిటల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను ప్రారంభించింది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)