Breaking News

ప్రీమియం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు

Published on Wed, 04/01/2026 - 11:17

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రీమియం ఇంధనాలతో పాటు వాణిజ్య ఎల్‌పీజీ, విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరికీ షాక్ ఇచ్చింది.

ప్రీమియం ఇంధనాలకు ధరల సెగ

లగ్జరీ కార్లు, సూపర్ బైక్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్‌పీ100 (100-ఆక్టేన్ పెట్రోల్) ధర ఢిల్లీలో లీటరుకు ఏకంగా రూ.11 పెరిగింది. దాంతో రూ.149 నుంచి రూ.160 కు చేరింది. ఎక్స్‌ట్రా గ్రీన్ (ప్రీమియం డీజిల్) రూ.91.49 నుంచి రూ.92.99 కు పెంచింది. రెండు వారాల క్రితమే హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌) తన ప్రీమియం పెట్రోల్ ధరను రూ.101.89 కు సవరించగా ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కూడా అదే బాటలో పయనించింది.

రూ.2,000 దాటిన వాణిజ్య సిలిండర్ ధర

వ్యాపారస్తులు, హోటళ్లు, క్యాటరింగ్ రంగంపై కమర్షియల్ ఎల్‌పీజీ భారం పడింది. జనవరి 1, 2026 నుంచి ఇది ఇటీవలి పెంపుతో ఐదోసార్లు ధరలు పెంచినట్లయింది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ప్రస్తుత ధర (ఏప్రిల్ 1) రూ.2,078.50 (19 కిలోల సిలిండర్)గా ఉంది. మార్చి 1 నాటి ధర రూ.1,768.50. గత నెల రోజుల్లోనే రూ.310 మేర భారం పడింది.

ఏటీఎఫ్ రూ.2 లక్షలు

విమానయాన రంగం మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలు కిలోలీటరుకు రూ.2 లక్షల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో ధర రూ.2,07,341.22 (కిలోలీటరుకు). గతంలో 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో గరిష్టంగా రూ.1.1 లక్షలు ఉన్న ధర, ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా అన్ని రికార్డులను తుడిచివేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో విమాన ప్రయాణ భారాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వ ఊరట

ప్రీమియం ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ సాధారణ వాహనదారులపై భారం పడకుండా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సాధారణ పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ధరల సెగ తగలకుండా చూసేందుకు మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల చమురు కంపెనీలకు కలిగే భారీ నష్టాలను భర్తీ చేయడంతో పాటు రిటైల్ మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది.

ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌ కాదు.. ఈసారి కండోమ్‌ల వంతు!

Videos

మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం

అజిత్ దోవల్ రెడ్ ఫైల్ లో ఏముంది? యుద్ధానికి సిద్ధమవుతున్న ఇండియా!

పెద్ది రిలీజ్ పై స్వయంగా క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్

ఆ లాఠీతో కొట్టడం ఏంటండీ.. హర్ష వీణ దాడిపై కారుమూరి వెంకట్ రెడ్డి రియాక్షన్

అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం

నన్ను రక్తం వచ్చేలా కొట్టారు.. అసలు ఏం జరిగిందంటే..

కమ్మ రాజధాని.! బాబు సైలెంట్..

జగన్ వస్తాడని బాబుకు అర్థమైంది.. అందుకే చట్టబద్ధత బిల్లు

అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణపై దాడి.. CCTV వీడియో

విజయ్ కింగా..? కింగ్ మేకరా..?

Photos

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)