Breaking News

షుగర్‌ పేషెంట్ల కోసం గ్లెన్‌మార్క్ కొత్త మెడిసిన్‌

Published on Wed, 03/12/2025 - 22:14

ప్రముఖ ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్ మధుమేహ రోగుల కోసం కొత్త మెడిషన్‌ విడుదల చేసింది. గ్లైసెమిక్ నియంత్రణ, బరువు తగ్గించే ఔషధాన్ని ప్రారంభించినట్లు గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ముంబైకి చెందిన ఈ ఔషధ సంస్థ గ్లెంపా (ఎంపాగ్లిఫ్లోజిన్ 10/25 ఎంజీ) బ్రాండ్ పేరుతో విస్తృతంగా గుర్తింపు పొందిన ఎస్జీఎల్టీ2 ఇన్హిబిటర్ ఎంపాగ్లిఫ్లోజిన్‌ను తన ఫిక్స్‌డ్‌ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ)'తో కలిపి విడుదల చేసింది.

టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న వారిలో గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడానికి ఈ మందులను రూపొందించారు. అదే సమయంలో కార్డియోవ్యాస్కులర్‌ ముప్పు ఉన్న రోగులకు కూడా మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ (టీ2డీఎం) పేషంట్లలో గ్లైసెమిక్ నియంత్రణని మెరుగుపర్చడం, బరువు తగ్గడానికి మద్దతునివ్వడం, కార్డియోవాస్కులర్-రీనల్ రిస్కులను తగ్గించడంతో పాటు ఎంపాగ్లిఫ్లోజిన్ పలు ప్రయోజనాలు చేకూరుస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది.

“భారత్‌లో కార్డియోమెటబోలిక్ సంరక్షణకు సంబంధించి వినూత్నమైన చికిత్సలను అందుబాటు స్థాయిలో ఆవిష్కరించడంలో గ్లెన్‌మార్క్‌కు ఘన చరిత్ర ఉంది. సీవీడీతో పాటు టీ2డీఎంను సమర్ధంగా ఎదుర్కొనడంలో పేషంట్లకు, హెల్త్‌కేర్ నిపుణులకు సాధికారత కల్పించేందుకు సమగ్రమైన, చౌకైన సొల్యూషన్‌ను అందించాలన్న మా నిబద్ధతకు గ్లెంపా శ్రేణి ఆవిష్కరణ నిదర్శనంగా నిలుస్తుంది” అని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ఇండియా ఫార్ములేషన్స్ బిజినెస్ అలోక్ మాలిక్ తెలిపారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)