Breaking News

ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్‌ గుడ్‌బై

Published on Wed, 07/23/2025 - 09:01

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)కు డిప్యూటీ ఎండీగా వ్యవహరిస్తున్న భారతీయ అమెరికన్‌ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. తాను హార్వర్డ్‌ యూనివర్సిటీ ఎకనామిక్స్‌ ప్రాఫెసర్‌గా తిరిగి వెళ్లనున్నట్టు ఆమె ప్రకటించారు. సెప్టెంబర్‌ 1న కొత్త బాధ్యతలను ఆమె స్వీకరించనున్నారు. ‘ఐఎంఎఫ్‌లో ఏడేళ్ల అద్భుత కాలం తర్వాత బోధనా వృత్తిలోకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను’అని ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఐఎంఎఫ్‌ చరిత్రలో మొదటి మహిళా ముఖ్య ఆర్థికవేత్తగానే కాదు, మొదటి డిప్యూటీ ఎండీగా గోపీనాథ్‌ పనిచేసి చరిత్ర సృష్టించడం గమనార్హం. ఐఎంఎఫ్‌లో సేవల పట్ల గీతా గోపీనాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు. అసాధారణ సవాళ్లతో కూడిన సమయంలో పనిచేయాల్సి రావడం జీవితంలో ఒక్కసారి దక్కే అవకాశంగా పేర్కొన్నారు. ‘అధ్యాపక మూలాలాల్లోకి తిరిగి వెళుతున్నాను. అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారంగా పరిశోధనలపై దృష్టి సారించాలని అనుకుంటున్నాను. తదుపరి తరం ఆర్థికవేత్తలకు  శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను’అని గోపీనాథ్‌ తన భవిష్యత్‌ ప్రణాళికలను వివరించారు.

ఇదీ చదవండి: రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలా

గోపీనాథ్‌ 2019లో ఐఎంఎఫ్‌లో ముఖ్య ఆర్థికవేత్తగా చేరారు. 2022 జనవరిలో ఐఎంఎఫ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పదవి సృష్టించి ఆ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. ఐఎంఎఫ్‌కు ముందు హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ స్టడీస్, ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేయడం గమనార్హం. గోపీనాథ్‌ అద్భుతమైన, అసాధారణ నేత అంటూ ఆమె సేవలను ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టలీనా జార్జీవా కొనియాడారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)