Breaking News

జాబ్‌ మార్కెట్‌లో ఇప్పుడిదే ట్రెండ్‌.. ఉద్యోగుల్ని మోసం చేస్తున్న కంపెనీలు

Published on Sun, 03/24/2024 - 13:40

ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు. మరోవైపు పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ వినియోగం. ఫలితంగా జాబ్‌ మార్కెట్‌ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో అదే జాబ్‌ మార్కెట్‌లో ‘గోస్ట్‌ జాబ్స్‌’  ట్రెండ్‌ మొదలైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ థ్రెడ్‌ యూజర్‌, హెచ్‌ఆర్‌ విభాగంలో పనిచేసే మౌరీన్ క్లాఫ్ అనే మహిళా ఉద్యోగి జాబ్‌ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్‌ గురించి షేర్‌ చేశారు. ఇంతకీ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న గోస్ట్‌ జాబ్స్‌ ఏంటో తెలుసా?

గోస్ట్‌ జాబ్స్‌ ట్రెండ్‌
గోస్ట్‌ జాబ్స్‌ ట్రెండ్‌ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..ఓ టెక్‌ కంపెనీలో సంబంధిత విభాగాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలి. ఇందుకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అప్లయ్‌ చేసుకోవచ్చంటూ సదరు కంపెనీ హైరింగ్‌ కేటగిరిలో సమాచారం ఇస్తుంది. పనిలో పనిగా అందులో ఓపెన్‌ అనే ఆప్షన్‌ ఉంచుతుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి కంపెనీకి కావాల్సిన అర్హతులు ఉన్న అభ్యర్ధులు జాబ్స్‌ కోసం అప్లయ్‌ చేస్తుంటారు. 

అసలు కథ అక్కడే మొదలవుతుంది. రోజులు, నెలలు గడుస్తున్నా ఉద్యోగాలకు అప్లయ్‌ చేస్తున్నా ఇంటర్వ్యూ కాల్‌ రాదు. కానీ కంపెనీ వెబ్‌సైట్‌ హైరింగ్‌ కేటగిరిలో ఉద్యోగులు కావాలనే సంకేతం ఇస్తూ ఓపెన్‌ అనే ఆప్షన్‌ను అలాగే ఉంచుతుంది. ఇదిగో ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి ఆయా కంపెనీలు. దీన్ని గోస్ట్‌ జాబ్స్‌ అని పిలుస్తున్నారు. 

 ఘోస్ట్ జాబ్ అంటే ఏమిటి?
ఘోస్ట్ జాబ్స్‌ అంటే తమ సంస్థలో ఖాళీలు ఉన్నాయి. జాబ్స్‌ కోసం అప్లయ్‌ చేసుకోవచ్చంటూ ప్రకటనలు ఇస్తాయి. కానీ ఉద్యోగుల్ని నియమించుకోవు. దీనికి కారణం కంపెనీని బట్టి  ఉంటుంది. అయితే ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగుల్ని నియమించుకునేందుకు తమ వద్ద నిధులు లేకపోవడం, టాలెంట్‌ ఉన్న అభ్యర్ధుల్ని గుర్తించేందుకు ఇలా చేస్తాయి. లేదంటే ఈ ఓపెన్‌ జాబ్‌లు త్వరలో ఖాళీ అవుతున్న ఉద్యోగాలకు ముందుగానే కొత్త వారిని ఎంపిక చేసుకునేందుకు ఇలా చేసేందుకు అవకాశం ఉందంటూ పలు నివేదికలు చెబుతున్నాయి.  

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఏం చెబుతోంది
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం.. కరోనా కష్టాలంలో చేస్తున్న ఉద్యోగులకు రాజీనామాలు చేసే సంఖ్య పెరగడం, ఆర్ధిక అనిశ్చితి కారణంగా ఘోస్ట్‌ జాబ్స్‌ ఉద్యోగాల సంఖ్య పెరిగినట్లు అంచనా. అంతేకాదు భవిష్యత్‌పై స్పష్టత లేని కంపెనీలు ఇలా ఘోస్ట్‌ జాబ్స్‌లో ఉద్యోగుల్ని నియమించుకోవడం ఓ కారణమని  అధ్యయనం తెలిపింది.

ఉద్యోగం నిజమా? కాదా? అని తేల్చేదెలా?
ఓ కంపెనీ ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చినప్పుడు అవి నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు పలు అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఘోస్ట్‌ జాబ్స్‌లో ఉద్యోగులు చేయాల్సి విధులు, ఇతర జీతభత్యాల గురించి అస్పష్టంగా ఉంటుంది.  ఒక అభ్యర్థి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారాలు లేదా నెలల తరబడి ఎలాంటి స్పందన ఉండదు. దీన్ని ఘోస్ట్‌ జాబ్స్‌ అని అర్ధం చేసుకోవాలి. లేదంటే తమ కంపెనీలో ఉద్యోగం ఉందని, అదే జాబ్స్‌ రోల్‌ ఎక్కువ కాలం ఉంచితే దాన్ని ఘోస్ట్‌ జాబ్‌గా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)