Breaking News

టమాటాలు కేజీ రూ. 70 - ఆర్డర్ చేస్తే ఇంటికే!

Published on Thu, 08/03/2023 - 10:11

How To Buy Tomatoes Rs.70 KG: భారతదేశంలో గత కొన్ని రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటున్నాయి. రైతులు మంచి లాభాలు పొందుతున్నప్పటికీ సామాన్యులకు ఇది పెనుభారంగా మారిపోయింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేజీ టమాటా ధర రూ. 200 దాటినట్లు సమాచారం. భారీ ధర వద్ద లభించే టమాటాలను తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టమాటా ధరల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ఆన్‌లైన్‌లో సరసమైన ధరకే విక్రయించడం ప్రారంభించింది. ఇది అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. కేవలం వారం రోజుల్లో ఏకంగా 10,000 కేజీల టమాటాలు అమ్ముడు కావడం గమనార్హం. ఇది ఇప్పటి వరకు కూడా ఢిల్లీ ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉంది.

రూ. 70కే పేటీఎమ్ భాగస్వామ్యంతో ఓఎన్డీసీ విక్రయిస్తోంది. పేటీఎమ్, మ్యాజిక్ పిన్, మై స్టోర్ వంటి యాప్స్ ద్వారా కూడా టమాటాలను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఒక కస్టమర్ వారానికి కేవలం 2 కేజీల టమాటాలు మాత్రమే కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేస్తే డోర్ డెలివరీ పొందవచ్చు. దీనికి ఎటువండి అడిషినల్ ఛార్జెస్ ఉండవు.

ఇదీ చదవండి: ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి..

పేటీఎమ్‌లో ఆర్డర్ చేసే విధానం..

  • స్మార్ట్‌ఫోన్లో లోకేష్ ఆన్ చేసుకున్న తరువాత, యాప్‌లో ఓఎన్డీసీ ఫుడ్ అని సర్చ్ చేయాలి.
  • ఓఎన్డీసీ ఓపెన్ అయిన తరువాత సమీపంలో ఉన్న స్టోర్స్ కనిపిస్తాయి, ఇందులో దాదాపు అన్నీ మీ లొకేషన్‌కు సమీపంలో ఉన్నవే ఉంటాయి.
  • ఇందులో మీ దగ్గరగా ఉన్న ఒక స్టోర్ ఎంచుకోవాలి, ఆ తరువాత ఆర్డర్ చేసుకోవాలి.
  • ఇవన్నీ పూర్తయిన తరువాత డెలివరీ పొందాల్సిన అడ్రస్ సెట్ చేసుకుని, ఆ తరువాత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.
  • ఇలాగే మీరు మ్యాజిక్‌పిన్ ద్వారా కూడా టమాటాలు ఆర్డర్ చేసుకోవచ్చు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)