Breaking News

రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్!

Published on Sun, 03/26/2023 - 16:43

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా.. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి అందుబాటులో ఉంది. అదే ‘గెట్ 1’ ఎలక్ట్రిక్ స్కూటర్. అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంఆర్‌పీ రూ.65,999గా ఉండగా దీన్ని ఇప్పుడు రూ. 38 వేలకే కొనుక్కోవచ్చు.

ఇదీ చదవండి: గ్యాస్‌ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! 

రూ.65,999 ఎంఆర్‌పీ ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో రూ. 43,499లకే అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా మరో ఆఫర్ కూడా ఉంది. రూ. 5 వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 38 వేలకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది.

కళ్లు చెదిరే ఫీచర్స్‌
గెట్ 1’ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 48వీ 13 ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్‌ కిలోమీటరు వెళ్లేందుకు అయ్యే ఖర్చు 10 పైసలు మాత్రమే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో కూడా కొనుక్కోవచ్చు. ఈబేబికార్ట్‌లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌ కొనుగోలుపై సందేహం అక్కర్లేదు. 7 రోజుల రిటర్న్ పాలసీ ఉంటుంది. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది. 

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 35 కిలోమీటర్లు. 130 కేజీల వరకు లోడింగ్ కెపాసిటీ ఉంటుంది. డ్రమ్ బ్రేక్స్‌, 250 వాట్ 48 వోల్ట్ బీఎల్‌డీసీ హబ్ మోటార్ ఇందులో ఉన్నాయి. ఫ్రంట్, రియర్ బ్రేక్ సెన్సార్లు, బ్యాటరీ ఇండికేటర్ ఆకట్టుకుంటున్నాయి. ట్యూబ్‌లెస్ టైర్లు, రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సెక్యూరిటీ లాక్ వంటివి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని ఫుల్‌గా చార్జింగ్ చేసేందుకు 6 నుంచి 7 గంటలు పడుతుంది.

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)