సెమాగ్లూటైడ్‌ జనరిక్స్‌ వెల్లువ

Published on Sun, 03/22/2026 - 05:35

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టైప్‌–2 మధుమేహం, ఊబకాయం నియంత్రణకు ఉపయోగించే  సెమాగ్లూటైడ్‌ ఔషధం పేటెంట్‌ దేశీయంగా ముగియడంతో దేశీ ఫార్మా దిగ్గజాలు పెద్ద ఎత్తున చౌక జనరిక్‌ వెర్షన్లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. దీనితో వీటి ధరలు గణనీయంగా దిగి వచ్చాయి. జనరిక్‌ వెర్షన్‌ను ఆవిష్కరించిన దిగ్గజాల్లో డాక్టర్‌ రెడ్డీస్, నాట్కో, సన్‌ ఫార్మా, గ్లెన్‌మార్క్‌ మొదలైనవి ఉన్నాయి. 

ఇన్నోవేటర్‌ హోదాలో డెన్మార్క్‌కి చెందిన నోవో నార్డిస్క్‌ సంస్థ .. సెమాగ్లుటైడ్‌ మాలిక్యూల్‌తో తయారు చేసిన ఔషధాన్ని ఒజెంపిక్, వెగోవీ బ్రాండ్స్‌ పేరిట విక్రయిస్తోంది. నెలకు సరిపడే డోసేజీలకు సంబంధించి వీటి వ్యయాల పరిమాణం .. డోసేజీ, దశను బట్టి రూ. 8,800 నుంచి రూ. 11,175 వరకు ఉంటోంది.  తాజాగా జనరిక్‌ వెర్షన్ల రాకతో ధరలు దాదాపు 80 శాతం వరకు దిగి వచి్చనట్లవుతుంది. మల్టీ–డోస్‌ వయల్స్, ప్రీ–ఫిల్డ్‌ పెన్‌ డివైజ్‌ల రూపంలో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి. ఔషధం ఒకటే అయినప్పటికీ ప్యాకేజింగ్, తయారీ విధానం, సౌకర్యం కారణంగా ప్రీ–ఫిల్డ్‌ పెన్‌ల ధర వయల్స్‌ కన్నా ఎక్కువగా ఉంటుంది.  

→ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ సంస్థ ఒబెదా బ్రాండ్‌ పేరిట వారానికి ఒకసారి తీసుకునే సెమాగ్లూటైడ్‌ ఇంజెక్షన్‌ని ప్రీ–ఫిల్డ్, డిస్పోజబుల్‌ పెన్‌ రూపంలో ప్రవేశపెట్టింది. కనీసం నాలుగు వారాలకు సరిపడేలా 2ఎంజీ, 4 ఎంజీ డోసుల్లో ఇది లభిస్తుంది. నెలవారీ వ్యయం రూ. 4,200గా ఉంటుందని సంస్థ సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ తెలిపారు. దీన్ని ఇతర దేశాల్లో కూడా ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ భాగస్వామ్యంతో యూఎస్‌వీ సంస్థ యుసెమా బ్రాండ్‌ పేరిట ఇంజెక్షన్‌ని ఆవిష్కరించింది.  

→ మరోవైపు, నాట్కో ఫార్మా సంస్థ మల్టీ–డోస్‌ వయల్స్‌ని సెమానాట్, సెమాఫుల్‌ పేరిట ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. వీటి నెలవారీ వ్యయం రూ. 1,290–1,750 శ్రేణిలో ఉంటుంది. అలాగే రూ. 4,000 నుంచి రూ. 4,500 వరకు నెలవారీ వ్యయం ఉండే పెన్‌ డివైజ్‌ని వచ్చే నెలలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఇక సెమాగ్లుటైడ్‌ జనరిక్‌ వెర్షన్‌ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు నాట్కో ఫార్మాతో ఒప్పందం ఉన్న ఎరిస్‌ లైఫ్‌ సైన్సెస్‌.. దీన్ని ’సండే’ పేరిట ప్రవేశపెట్టింది. అటు టోరెంట్‌ ఫార్మా సంస్థ సెంబాలిక్, సెమాలిక్స్‌ బ్రాండ్స్‌ పేరిట ఆవిష్కరించింది.  

ఇతర సంస్థల వివరాలిలా.. 
సన్‌ ఫార్మా: నావెల్‌ట్రీట్, సెమాట్రినిటీ బ్రాండ్స్‌ కింద ఇంజెక్షన్లను ఆవిష్కరించింది. నావెల్‌ట్రీట్‌ 0.25 ఎంజీ నుంచి 2.4 ఎంజీ వరకు అయిదు డోసేజీల్లో లభిస్తుంది. వారంవారీ వ్యయం సుమారు రూ. 900 నుంచి రూ. 2,000 వరకు ఉంటుంది. ఇక సెమాట్రినిటీ వ్యయం రూ. 750 నుంచి రూ. 1,300 వరకు ఉంటుంది. 

గ్లెన్‌మార్క్‌: గ్లిపిక్‌ పేరిట ఇంజెక్షన్‌ని ప్రవేశపెట్టింది. వయల్స్‌ వ్యయం వారంవారీగా రూ. 325 నుంచి రూ. 440 వరకు ఉంటుంది. పెన్‌ల రూపంలో కూడా ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.  

జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌: సెమాగ్లిన్‌టీఎం, మాషెమాటీఎం, ఆల్టర్‌మెట్‌ బ్రాండ్స్‌ పేరిట ఇంజెక్షన్లను ఆవిష్కరించింది. సగటున నెలవారీ వ్యయం రూ. 2,200గా ఉంటుంది. 

ఆల్కెమ్‌ ల్యాబ్స్‌: సెమాసైజ్, ఒబీసిమా, హెపాగ్లైడ్‌ బ్రాండ్స్‌ పేరిట ఇంజెక్షన్లను ఆవిషఅకరించింది. ప్రీ–ఫిల్డ్‌ డిస్పోజబుల్‌ ఇంజెక్షన్‌ పెన్‌  నెలకు నాలుగు డోసుల కింద లభిస్తుంది. వారం వారీ వ్యయం సుమారు రూ. 450 నుంచి, నెలవారీ వ్యయం రూ. 1,800 నుంచి ప్రారంభమవుతుంది. రీయూజబుల్‌ పెన్‌ రూపంలో కూడా లభిస్తుంది.

Videos

ఎండలను కంట్రోల్ చేస్తా.. వాట్ ఈజ్ దిస్ విడ్డూరం

ధురంధర్ 2 తెలుగు వర్షన్ రిలీజ్ ఎప్పుడు? అసలు కారణం ఏంటి?

ఒక్కసారిగా బాంబుల వర్షం.. ఇజ్రాయెల్ లో భయానక పరిస్థితి

ఇదిగో దస్తగిరి స్టేట్మెంట్.. ఈ ఒక్క దానికి సమాధానం చెప్పండి చాలు

శబాష్ జగన్.. ఇది మీకే సాధ్యం.. వైఎస్ జగన్ పై కేంద్రం ప్రశంసలు

BR నాయుడు రాసలీలపై చంద్రబాబు కొత్త డ్రామా

మిత్రపక్షానికి బాబు వెన్నుపోటు.. పవన్ కు ఆహ్వానం లేదు

2 రోజులే టైం.. తర్వాత ఇరాన్ ఉండదు.. ట్రంప్ సంచలన వార్నింగ్

మహిళతో టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు సంచలన ఆడియో లీక్

విశాఖకు వరంలా మారిన YS జగన్ విజన్

Photos

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)