Breaking News

మల్టీప్లెక్స్‌ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్!

Published on Sat, 06/13/2026 - 12:34

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీప్లెక్స్ థియేటర్ల ముఖచిత్రం వేగంగా మారుతోంది. కేవలం భారీ బడ్జెట్, అగ్ర హీరోల పెద్ద సినిమాలపైనే ఆధారపడకుండా నిరంతరం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సరికొత్త వ్యూహాలను తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ‘జెన్ జీ’ వినియోగదారులను తమ ప్రధాన ఆడియన్స్ గ్రూప్‌గా మల్టీప్లెక్స్ పరిశ్రమ టార్గెట్ చేస్తోంది. ఓటీటీలు, రీల్స్ వంటి ఆన్‌లైన్ వేదికలపై విరక్తి (డిజిటల్ అలసట) చెందిన యువత.. మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేస్తుండటం ఇండస్ట్రీలో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

మరోవైపు, పెద్ద సినిమాల విడుదలకు మధ్య ఉండే గ్యాప్‌లో మల్టీప్లెక్స్‌ల్లో ఆక్యుపెన్సీ రేటు పడిపోకుండా ప్రాంతీయ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు, ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లే చిన్న చిత్రాలు (స్లీపర్‌ హిట్లు) కీలక పాత్ర పోషిస్తున్నాయి.

బాక్సాఫీస్‌ను శాసిస్తున్న యూత్!

ఇటీవల విడుదలైన ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్‌ మీడియా టోబర్‌ 2026 నివేదిక ప్రకారం.. భారతీయ బాక్సాఫీస్ వసూళ్లలో యువత పాత్ర ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. హిందీ బాక్సాఫీస్ మొత్తం కలెక్షన్లలో 30 ఏళ్ల లోపు ఉన్న యువత వాటా ఏకంగా 57% గా ఉంది. ఇక ఒక సినిమా విడుదలైన మొదటి రోజు (ఫస్ట్ డే) వచ్చే రెవెన్యూలో ఈ యువ తరం వాటా అత్యధికంగా 70% గా నమోదు కావడం విశేషం.

‘ప్రస్తుతం సినిమా థియేటర్లకు వస్తున్న వారిలో జెన్ జీ తరం వారే అత్యధికంగా ఉంటున్నారు. ఆన్‌లైన్ వేదికలతో విసిగిపోయిన యువత, మళ్లీ వెండితెర అనుభూతిని ఆస్వాదించేందుకు థియేటర్లకు తిరిగి వస్తున్నారు’ అని పీవీఆర్ ఐనాక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ బిజ్లీ అన్నారు.

ఒరిజినల్ కథలకే జై కొడుతున్న యువత

ఏదో ఒక సూపర్ హీరో ఫ్రాంచైజీలనో, పాత హిట్ చిత్రాల రీమేక్‌లనో లేదా రీబూట్‌లనో కాకుండా.. సరికొత్త లైన్లతో, ఒరిజినల్ కథాంశాలతో వచ్చే సినిమాలను చూసేందుకే యువత మక్కువ చూపుతున్నారని సంజీవ్ బిజ్లీ పేర్కొన్నారు. యువ దర్శకులు రూపొందించిన సరికొత్త చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎలా కనెక్ట్ చేస్తున్నాయనే దానికి కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ హారర్ చిత్రం ‘అబ్సెషన్’, కేన్ పార్సన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్యాక్‌రూమ్స్’ చిత్రాల విజయాలే నిదర్శనమని ఉదహరించారు.

భవిష్యత్తు ట్రెండ్స్ ఇవే..

  • సినిమా ఎగ్జిబిషన్ రంగాన్ని రాబోయే రోజుల్లో కొన్ని అంశాలు శాసించనున్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అవి..

  • థియేటర్లలో అధునాతన స్క్రీన్లు, మెరుగైన సీటింగ్, లగ్జరీ అనుభూతిని అందించడం.

  • ద్వితీయ, తృతీయ శ్రేణి (టైర్‌2, టైర్‌3) పట్టణాలు, నగరాలకు మల్టీప్లెక్స్‌లను విస్తరించడం.

  • కేవలం ఈవెంట్ సినిమాలు, పెద్ద చిత్రాలపైనే ఆధారపడకుండా.. విభిన్నమైన కంటెంట్‌తో వచ్చే స్లీపర్ హిట్ చిత్రాల ద్వారా థియేటర్లను నిరంతరం నిర్వహించడం.

ఇదీ చదవండి: కాకపెంచుతున్న పసిడి ధరలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)