Breaking News

రత్నాభరణాలపై జీఎస్టీ తగ్గింపు?

Published on Wed, 01/08/2025 - 10:21

రత్నాభరణాల పరిశ్రమలో ఉత్పత్తవుతున్న వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) ప్రభుత్వాన్ని కోరింది. జీఎస్టీకి సంబంధించి రాబోయే బడ్జెట్‌లో తీసుకోబోయే నిర్ణయాలపై వివిధ విభాగాల నుంచి ప్రభుత్వం వినతులు కోరింది. అందులో భాగంగా జీజేసీ రత్నాభరణాల ఉత్పత్తిపై జీఎస్టీని తగ్గించాలని తెలిపింది.

ఈ సందర్భంగా జీజేసీ ఛైర్మన్ రాజేశ్ రోక్డే మాట్లాడుతూ..‘జెమ్స్ అండ్ జువెలరీ రంగం ఉత్పత్తి చేస్తున్న వస్తువులపై జీఎస్టీ(GST)ని 1 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రస్తుతం అది 3 శాతంగా ఉంది. జీఎస్టీని తగ్గిస్తే వినియోగదారులపై వ్యయ భారం తగ్గుతుంది. రాబోయే బడ్జెట్లో వ్యాపారాలకు, తయారీ రంగానికి ఊతమిచ్చేలా పన్నుల హేతుబద్ధీకరణ ఉండాలని తెలియజేశాం. వరుసగా పెరుగుతున్న బంగారం రేట్లకు అనుగుణంగా ప్రస్తుత జీఎస్టీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ఇది పరిశ్రమకు, అంతిమ వినియోగదారులకు భారంగా మారుతోంది. సహజ వజ్రాలు, ల్యాబ్‌లో తయారు చేసే వజ్రాలకు మధ్య తేడా గుర్తించేలా పకడ్బందీ విధానాలు ఉండాలి. ప్రస్తుతం సహజ వజ్రాలు(Natural diamonds), ప్రయోగశాలలో తయారు చేసే వజ్రాలపై ఒకే జీఎస్టీ రేటు ఉంది. ల్యాబ్‌లో తయారు చేసే వజ్రాలపై జీఎస్టీ తగ్గించాలి’ అన్నారు.

ఇదీ చదవండి: అమెజాన్‌ తొలి రాకెట్‌ ప్రయోగం.. స్పేస్‌ఎక్స్‌కు ముప్పు?

ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐ

జ్యువెలరీ పరిశ్రమకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని, రాష్ట్రాల వారీగా స్పెషల్‌ నోడళ్లను ఏర్పాటు చేయాలని జీజేసీ ప్రభుత్వాన్ని కోరింది. ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నట్లు జీజేసీ తెలిపింది. వచ్చే సమావేశాల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. పన్ను రేటు తగ్గింపు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అధికారిక కొనుగోళ్లు పెరుగుతాయని జీజేసీ వైస్ ఛైర్మన్ అవినాష్ గుప్తా అన్నారు. ఆర్థిక వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న గృహ బంగారాన్ని వెలికితీసే కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)