Breaking News

తండ్రి స్థానంలోకి కొడుకు.. అదానీ గ్రూప్‌లో కొత్త పరిణామాలు

Published on Thu, 01/04/2024 - 09:18

అదానీ గ్రూప్‌లో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కరణ్ అదానీని నియమించింది. ఇక ఆయన తండ్రి గౌతమ్ అదానీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మళ్లీ నియమితులయ్యారు.

దేశంలో అతిపెద్ద పోర్ట్స్, లాజిస్టిక్స్ కంపెనీ అయిన ఏపీఎస్‌ఈజెడ్‌ తమ సీఈవో కరణ్ అదానీని మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు అదానీ గ్రూప్‌ విడుదల చేసిన ప్రకటనను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. కాగా ఈ పదవిని ఇప్పటిదాకా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిర్వహిస్తున్నారు.

మరోవైపు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నిస్సాన్ మోటార్స్‌లో మాజీ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్వనీ గుప్తా నియామకానికి కూడా తమ బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ తెలిపింది.

కరణ్ అదానీ 2009లో ముంద్రా పోర్ట్‌లో తన తండ్రి వ్యాపార సమ్మేళనంలో చేరారు. 2016లో దాని సీఈవోగా ఎదిగారు. మరొక పరిణామంలో ఏపీఎస్‌ఈజెడ్‌ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను విక్రయించడం ద్వారా 600.6 మిలియన్‌ డాలర్ల వరకు సమీకరించనున్నట్లు తెలిపింది. అయితే వసూళ్లను ఎలా వినియోగించుకుంటారో కంపెనీ పేర్కొనలేదు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)