గౌతమ్ అదానీ వేతనం పెరిగింది.. కానీ..

Published on Sun, 06/08/2025 - 16:50

అదానీ గ్రూప్ చైర్మన్, దేశంలోనే రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ .10.41 కోట్ల వేతనం అందుకున్నారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. అదానీ గ్రూప్‌లోని తొమ్మిది లిస్టెడ్ కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (రూ.2.54 కోట్లు), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (రూ.7.87 కోట్లు) నుంచి ఆయనకీ ఆదాయం వచ్చింది.

గతంతో పోలిస్తే ఈసారి వేతనం పెరిగినప్పటికీ, అదానీ పారితోషికం దేశంలోని చాలా మంది అగ్రశ్రేణి పారిశ్రామిక అధినేతల కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. తోటి వ్యాపారాధినేతలైన సునీల్ భారతి మిట్టల్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.32.27 కోట్లు), రాజీవ్ బజాజ్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.53.75 కోట్లు), పవన్ ముంజాల్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.109 కోట్లు), ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ (2025 ఆర్థిక సంవత్సరంలో రూ.76.25 కోట్లు), ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఎస్ పరేఖ్ (2025 ఆర్థిక సంవత్సరంలో రూ.80.62 కోట్లు) వంటి వారు అదానీ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తన గ్రూప్‌లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లలో కొంతమంది అదానీ కంటే ఎక్కువ పారితోషిక ప్యాకేజీలను అందుకున్నారు. ఏఈఎల్ సీఈవో వినయ్ ప్రకాశ్ రూ.69.34 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎండీ వినీత్ ఎస్ జైన్ రూ.11.23 కోట్లు ఆర్జించారు. ఇది భారతదేశ కార్పొరేట్ నాయకత్వంలోని విభిన్న వేతన నిర్మాణాలను హైలైట్ చేస్తుంది. ఇక్కడ కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వేతన ఆధారిత సంపాదనలో కంపెనీ వ్యవస్థాపకులనే అధిగమిస్తుండటం గమనించవచ్చు.

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)