Breaking News

టీమిండియా విజయానికి అదానీ ప్రచారం

Published on Sun, 06/25/2023 - 09:25

దేశంలోని టాప్‌ బిలియనీర్లలో ఒకరు, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్ అదానీ భారత్‌ క్రికెట్‌ జట్టుకు మద్దతుగా నిలిచారు. రాబోయే ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్‌ విజయానికి మద్దతుగా 1983 వరల్డ్‌ కప్ గెలిచిన జట్టు హీరోలతో కలిసి 'జీతేంగే హమ్' ప్రచారాన్ని ప్రారంభించారు.

"భారత క్రికెట్ అభిమానులను ఏకం చేస్తుంది. #JeetengeHum పేరుతో ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో టీమ్ ఇండియాకు మద్దతు ఇస్తుంది. విజయం కోసం జట్టులో తపనను, మనోధైర్యాన్ని పెంచుతుంది" అని ఈ క్యాంపెయిన్‌ గురించి అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఆ రెండు లక్షణాలు ఉండాలి
ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ‘దేశంలో విస్తృతమైన భావోద్వేగాలను ప్రేరేపించే శక్తి క్రికెట్‌కు ఉంది. పుట్టుకతోనే ఎవరూ లెజెండ్‌లు కారు.. స్థిరత్వం, పట్టుదలతో కృషి చేసిన లెజెండ్‌లుగా ఎదుగుతారు. 1983లో ప్రపంచకప్‌ గెలిచిన జట్టుకు ఉన్న ఈ రెండు లక్షణాలు వచ్చే వరల్డ్‌ కప్‌లో ఆడే జట్టుకూ ఉండాలి’ అన్నారు. చరిత్ర పునరావృతం కావాలని కాంక్షిస్తూ రాబోయే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. 

అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నాలుగు దశాబ్దాల క్రితం 1983 వరల్డ్‌ కప్‌ విజేత జట్టు సంతకం చేసిన ప్రత్యేక బ్యాట్‌ను కపిల్‌ దేవ్‌ అదానీకి బహూకరించారు. ‘2023 ODI ప్రపంచ కప్‌లో టీమిండియా విజయానికి మద్దతుగా అదానీ గ్రూప్‌తో ఏకం కావడం గౌరవంగా భావిస్తున్నాం’ అని కపిల్ దేవ్ అన్నారు. ఈ ప్రచారం త్వరలో డిజిటల్ విషెంగ్ వేదికను పరిచయం చేస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీమిండియాకు తమ శుభాకాంక్షలను, సందేశాలను ఇక్కడ తెలియజేయవచ్చు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)