ఏఎం గ్రీన్‌తో గెయిల్ ఒప్పందం

Published on Fri, 10/04/2024 - 18:20

దేశంలో స్థిరమైన ఇంధన పరిష్కారాల అభివృద్ధికి గెయిల్ (ఇండియా) లిమిటెడ్, ఏఎం గ్రీన్ బీవీ (AMG) సంస్థలు జట్టుకట్టాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈమిథనాల్ ఉత్పత్తి కోసం కార్బన్ డయాక్సైడ్ (CO2) దీర్ఘకాలిక సరఫరా, దేశం అంతటా  హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అన్వేషణపై భాగస్వామ్యం దృష్టి సారిస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో గెయిల్‌ తెలిపింది.

గెయిల్‌ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్‌మెంట్) రాజీవ్ సింఘాల్ సమక్షంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ & ప్రొడక్షన్) సుమిత్ కిషోర్, ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఒప్పందంలో భాగంగా ఈమిథనాల్‌ను ఉత్పత్తి కోసం కార్బన్‌ డయాక్సైడ్‌  దీర్ఘకాలిక సరఫరా కోసం అధ్యయనాలను చేపట్టాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతిపాదిత ఇమిథనాల్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడానికి గెయిల్‌కి  కూడా ఈక్విటీ ఆప్షన్‌ ఉంటుంది. అలాగే దేశం అంతటా 2.5 గిగావాట్స్‌ వరకు సోలార్/విండ్ హైబ్రిడ్ పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటును సంయుక్తంగా అన్వేషించాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)