Breaking News

మొటిరోజే భారీ నష్టాలు.. మార్కెట్‌ల దిశా నిర్దేశి బడ్జెట్టే!

Published on Mon, 01/27/2025 - 21:05

కొలంబియాపై టారిఫ్‌లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలెట్టిన పోరు ప్రపంచ మార్కెట్లను గడగడలాడించింది. మన స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాలేదు . గతవారం మొత్తం మీద దాదాపు అరశాతం నష్టపోయిన సూచీలు ఈవారం మొదటి రోజునే భారీ నష్టాలను చవిచూశాయి. కిందటి వారంనష్టాలకు వివిధ కారణాలు దోహదం చేశాయి. వాటిలో ప్రధానమైనది విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం. చమురు ధరలు కొంత శాంతిస్తున్నట్లు కనబడుతున్నా, బంగారం ధరలు కొత్త రికార్డుల దిశగా దూసుకుపోవడం, ప్రముఖ కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటం, రూపాయి బలహీనతలు కొనసాగడం మార్కెట్ల క్షీణతలో తమవంతు పాత్ర పోషించాయి.

గత వారం మొత్తానికి సెన్సెక్స్ 429 పాయింట్లు కోల్పోయి 76190 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 23092 పాయింట్ల వద్ద స్థిరపడగా.. సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ 824 పాయింట్లు క్షీణించి 75366 వద్ద, నిఫ్టీ 263 పాయింట్ల నష్టంతో 22829 వద్ద ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు సైతం భారీ నష్టాల్లోనే సాగాయి.  

ఈవారం
ఈవారం మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇందుకు ఉదాహరణ సోమవారమే కనిపించింది. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని బడా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి. మరోపక్క టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు చేయబోయే ప్రకటనలు రాబోయే రోజుల్లో మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.

దీనికంటే ముందు మన మార్కెట్ల దశ - దిశ మార్చేది మాత్రం బడ్జెట్టే. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదేసమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను కిందకు లాగుతూనే ఉంటాయి.

ఈవారం ఆర్ధిక ఫలితాల కంపెనీలు
మార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల వాటిలో కోల్ ఇండియా, కెనరా బ్యాంకు, టాటా స్టీల్, ఏసీసీ, బజాజ్ ఆటో, సిప్లా, టీవీఎస్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, టాటా మోటార్స్, అంబుజా సిమెంట్, అదానీ పవర్, ఎల్ & టీ, బజాజ్ ఫిన్ సర్వ్, భెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్ అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసి, ఇండస్ ఇండ్ బ్యాంకు, నెస్లే ల ఫలితాలు ఉంటాయి. తర్వాతి స్థానంలో పెట్రోనెట్, హిందుస్థాన్ జింక్,  బాష్, జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్, ఎస్సారెఫ్ వోల్టాస్, రేమండ్, భారత్ ఎలక్ట్రానిక్స్, గెయిల్,  టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్, జిందాల్ స్టీల్, బయోకాన్, డాక్టర్ లాల్ పాత్, అజంతా ఫార్మా, మారికో, బంధన్ బ్యాంకు, ఎల్ఐసి హౌసింగ్, జ్యోతి లాబ్స్ ల ఫలితాలపైనా ఓ కన్నేసి ఉంచాల్సిందే.

ఎఫ్ఐఐలు
విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐలు) కు భారత్‌లో పెట్టుబడులపై వస్తున్న రిటర్నులు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. మరోపక్క అమెరికాలో బాండ్ల రాబడి ప్రోత్సాహకారంగా ఉంది. దీంతో వారు మన మార్కెట్లో భారీ స్థాయిలో విక్రయాలకు పాల్పడుతూ, పెట్టుబడులను తరలిస్తున్నారు. ఫలితంగా రూపాయి క్షీణిస్తూ డాలర్ బలపడుతూ వస్తోంది.

గత ఏడాది మొత్తం మీద అధిక స్థాయిలో విక్రయాలకు ప్రాధాన్యం ఇచ్చిన విదేశీ మదుపర్లు ఈ ఏడాది మొదటి నెలలోనూ అదే ధోరణిలో సాగుతున్నారు. నెల మొత్తం మీద ఇప్పటిదాకా వీరు దాదాపు రూ.74,000 కోట్ల దాకా షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు దాదాపు రూ.73,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. తద్వారా మార్కెట్‌లు భారీ స్థాయిలో పడిపోకుండా వీరు అడ్డుకోగలుగుతున్నారు. సోమవారం ఒక్కరోజే ఎఫ్ఐఐలు రూ. 5,000 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేయగా, దేశీయ మదుపర్లు రూ. 6,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.

సాంకేతిక స్థాయిలు
మార్కెట్లలో ఎక్కడా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. ఇదే ధోరణి కొనసాగితే సూచీలు మరింత పడిపోవడం ఖాయం. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ  ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్ లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. సెన్సెక్స్, నిఫ్టీ లు ఏమాత్రం తేరుకునే ప్రయత్నం చేస్తున్నా వెంటనే బేర్స్ రంగంలోకి దిగి వాటిని పడగొడుతూనే ఉన్నారు. మార్కెట్‌కు 23050 వద్ద మద్దతు లభించాల్సి ఉన్నప్పటికీ, సోమవారం ఉదయమే ఇది బ్రేక్ అయిపొయింది.  

ఒకవేళ మార్కెట్లు తేరుకుంటే మాత్రం 23350 ప్రధాన నిరోధంగా భావించాలి. దానికంటే ముందు 22950, 23050, 23200, స్థాయిల వద్ద నిఫ్టీ కి నిరోధాలు ఉన్నాయి. పతనాన్ని కొనసాగిస్తే తదుపరి మద్దతు 22750 దగ్గర లభిస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేస్తే 22600, 22500 స్థాయిలను టెస్ట్ చేయవచ్చు. అది కూడా దాటుకుని పడిపోతే... 22200 వరకు భారీ పతనం తప్పదు. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉన్నా సూచీలు మరింత పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది.

వీటన్నిటి సంగతి ఎలా ఉన్నా. మన మార్కెట్‌కు భవిష్యత్ దిశా నిర్దేశి మాత్రం బడ్జెట్టే. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించబోయే చర్యల కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. ఏమాత్రం తేడా జరిగినా భారీ పతనం తప్పదు. ప్రోత్సాహకరంగా ఉంటే మాత్రం ఇప్పటి స్థాయిల నుంచి తేరుకోవడమే కాక, సూచీలు పరుగులు పెడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ సోమవారం నాటికి 8.24 శాతంపెరిగి 18.13 దగ్గర ఉంది. భారీ ఒడుదొడుకులను ఇది తెలియజెబుతోంది.

- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)