Breaking News

హెల్త్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై జీఎస్టీకి గుడ్‌బై!

Published on Thu, 08/21/2025 - 00:39

న్యూఢిల్లీ: వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) నుంచి మినహాయింపునివ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై దాదాపు అన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. బీమాపై వివిధ రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన 13 సభ్యుల బృందం (జీవోఎం) ఈ ప్రతిపాదనపై చర్చించింది. జీఎస్‌టీ రేట్ల కోత ప్రయోజనాలు కంపెనీలకు కాకుండా కస్టమర్లకు బదిలీ అయ్యేలా తగు విధానాన్ని రూపొందించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ను కోరినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

వ్యక్తిగత బీమా పాలసీలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపునివ్వడం వల్ల ఏటా రూ. 9,700 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనాలు ఉన్నాయని వివరించారు. మంత్రుల అభిప్రాయాలు, అభ్యంతరాలను పొందుపర్చిన నివేదికను జీఎస్‌టీ కౌన్సిల్‌కి సమర్పించనున్నట్లు బీమాపై జీవోఎం కన్వీనరు, బిహార్‌ డిప్యుటీ సీఎం సామ్రాట్‌ చౌదరి తెలిపారు. అక్టోబర్‌ ఆఖరు నాటికి జీవోఎం తుది నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తోంది. 2023–24లో కేంద్రం, రాష్ట్రాలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై రూ. 8,263 కోట్లు, హెల్త్‌ రీఇన్సూరెన్స్‌ ప్రీమియంపై రూ. 1,484 కోట్లు జీఎస్‌టీ రూపంలో సమీకరించాయి.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)